NTV Telugu Site icon

San Francisco: శాన్ ఫ్రాన్సిస్కో మిషన్ జిల్లాలో కాల్పులు .. 9 మందికి గాయాలు

San Francisco

San Francisco

San Francisco: శాన్ ఫ్రాన్సిస్కోలోని మిషన్ డిస్ట్రిక్ట్ పరిసరాల్లో కాల్పులు జరగడంతో 9 మంది గాయపడ్డారు. ఇది కావాలని లక్ష్యంగా చేసుకొని పాల్పడిన ఘటన అని పోలీసులు భావిస్తున్నారు. కాల్పుల్లో గాయపడిన బాధితులను శాన్ ఫ్రాన్సిస్కో జనరల్ హాస్పిటల్‌కు తరలించినట్లు తెలిపారు.
కాల్పుల బాధితులు 9 మంది ఉన్నారని నిర్ధారించగలిగామని.. వారందరూ బయటపడతారని భావిస్తున్నామని శాన్ ఫ్రాన్సిస్కో పోలీసు విభాగం ఒక ట్వీట్‌లో తెలిపింది.

Read also: NCP: అజిత్ పవార్‌కి చెక్.. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్..

బ్లాక్ పార్టీ కొనసాగుతున్నప్పుడు కాల్పులు జరిగాయని.. బాధితులందరూ ప్రాణాలతో బయటపడతారని శాన్ ఫ్రాన్సిస్కో పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ ఈవ్ లౌక్వాన్‌సతితయ ఒక వార్తా సమావేశంలో తెలిపారు. శాన్ ఫ్రాన్సిస్కో బోర్డ్ ఆఫ్ సూపర్‌వైజర్స్ శాసన సహాయకుడు శాంటియాగో లెర్మా ప్రకారం, బాధితుల్లో కనీసం ఐదుగురు ఆసుపత్రి పాలయ్యారని.. ఐదుగురు క్షతగాత్రులలో ఒకరు శుక్రవారం రాత్రికి శస్త్రచికిత్స జరిగిందని.. నలుగురు వ్యక్తులు స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారని చెప్పారు.

Read also: Pakistan: పాకిస్తాన్ బడ్జెట్ వాస్తవికంగా లేదు… ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ నేతలు

రాత్రి 9 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. బట్టల రిటైలర్ డైయింగ్ బ్రీడ్ హోస్ట్ చేసిన బ్లాక్ పార్టీ వెలుపల ఘటన జరిగింది. ఇప్పటి వరకు పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదు. కాల్పులకు ఘటనకు సంబంధించి విచారణను నిర్వహిస్తున్నామని శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలు తెలియగానే మీడియకు విడుదల చేయబడతాయని చెప్పారు. సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు తుపాకీ గాయాలతో బాధపడుతున్న అనేక మంది బాధితులను గుర్తించినట్టు పోలీసులు ప్రకటనలో తెలిపారు. బాధితులను స్థానిక ఏరియా ఆసుపత్రులకు తరలించి చికిత్స చేసేందుకు అధికారులు వైద్యులను అక్కడికి పిలిపించారు.