దెయ్యాలు ఉన్నాయా.. నిజంగా దెయ్యాలు మనుషులకు కనిపిస్తాయా..? అంటే అది నమ్మేవారిని బట్టి ఉంటుంది అంటారు కొందరు. దేవుడు ఉన్నాడు అని నమ్మితే ఖచ్చితంగా దెయ్యాలు కూడా ఉన్నాయని నమ్మాలి. కోరిక తీరాకపోతే మనిషి చనిపోయాకా దెయ్యంగా మారతాడని చాలామంది సినిమాలల్లో చూపిస్తారు. తమకిష్టమైన వారి చుట్టూనే తిరుగుతూ తమ కోరికను తీర్చుకొని వెళ్ళిపోతారట.. అయితే తాజాగా ఒక యువతి , తన బాయ్ ఫ్రెండ్ దెయ్యంగా మారి తనకు చుక్కలు చుపిస్తున్నాడని బాధపడుతుంది. అంతేకాకుండా దానికి కారణం కూడా తానే అని చెప్పుకొంటుంది. ఇంతకీ ఈ దెయ్యం కథ ఏంటో చూద్దాం..
ఇంగ్లండ్‌లో నివాసముంటున్న 38 ఏళ్ల బ్రోకార్డ్ ఆక్స్‌ఫర్డ్ షైర్ గాయనిగా పనిచేస్తోంది. ఆమె ఎడ్వర్డో అనే వ్యక్తిని ప్రేమించింది. ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ విధి వక్రించి ఎడ్వర్డో ఒక ప్రమాదంలో మృతి చెందాడు. ప్రియుడి మరణాన్ని జీర్ణించుకోలేని బ్రోకార్డ్ అతగాడి ఊహలలోనే ఎక్కువ సమయం గడుపుతుండేది. అతడినే తలుచుకొని బాధపడుతూ స్నేహితులకు, బంధవులకు పబ్లిక్ గా తమ రొమాంటిక్ విషయాలను పంచుకుంది.
ఎప్పుడైతే తమ రొమాన్స్ ఎదుటివారికి చెప్పిందో అప్పటినుంచి ఆమె ఇంట్లో వింత వింత సంఘటనలు జరగడం మొదలయ్యాయి. దీంతో భయపడిన బ్రోకార్డ్ తన ప్రియుడు తనపై కోపంగా ఉన్నాడని, తాను ఎప్పుడు నా చుట్టూనే తిరుగుతున్నట్లు అనిపిస్తోందని చెప్పుకొచ్చింది. తమ రొమాంటిక్ సీక్రెట్స్ బయటకి చెప్తే ఎవరికైనా కోపం వస్తుందని, తను అలా చేయబట్టే తన ప్రియుడు దెయ్యంగా మారి తనను భయపెడుతున్నట్లు తెలిపింది. ఇంగ్లండ్‌లో నిర్వహించే హలోవిన్ ఉత్సవాన్ని చనిపోయిన ఆత్మలు.. హలోవిన్‌ను వాలెంటైన్స్‌గా భావిస్తారని , అందుకే తన ప్రియుడి ఆత్మకు శాంతి కలగాలని క్యాండిల్స్ వెలిగించి, తనకిష్టమైన ఫుడ్ వండి పెట్టానని తెలిపింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.