Canada: కెనడాలో మరో ఘోరం.. టొరంటో వర్సిటీలో భారతీయ విద్యార్థి హత్య
- కెనడాలో మరో ఘోరం
- టొరంటో వర్సిటీలో భారతీయ విద్యార్థి హత్య
- కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్న కాన్సులేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెనడాలో మరో ఘోరం జరిగింది. ఇటీవల టొరంటోలో 30 ఏళ్ల భారతీయ మహిళ హిమాన్షి ఖురానా హత్య ఘటన మరువక ముందే మరో భారతీయ విద్యార్థి శివంక్ అవస్థి (20) హత్యకు గురయ్యాడు. దీంతో భారతీయుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

Also Read
- Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
- China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
- Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
టొరంటో విశ్వవిద్యాలయంలోని స్కార్బరో క్యాంపస్ సమీపంలో మంగళవారం 20 ఏళ్ల భారతీయ విద్యార్థి శివంక్ అవస్థిపై దుండగుడు కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలతో ఉండగా పోలీసులు గమనించారు. ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు . ఈ ఏడాది టొరంటోలో జరిగిన 41వ హత్య కేసుగా పోలీసులు తెలిపారు.
‘‘మంగళవారం మధ్యాహ్నం సుమారు 3:34 గంటలకు హైలాండ్ క్రీక్ ట్రైల్, ఓల్డ్ కింగ్స్టన్ రోడ్ ప్రాంతంలో గుర్తుతెలియని కాల్‌పై పోలీసులు స్పందించారు. తీవ్ర గాయాలతో ఉన్న వ్యక్తి గురించి సమాచారం తెలియగానే అధికారులు స్పందించారు. తుపాకీ గాయంతో ఒక ఉన్న బాధితుడిని అధికారులు గుర్తించారు. బాధితుడు అక్కడికక్కడే మరణించాడు.’’ అని పోలీసులు బుధవారం ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. పోలీసులు వచ్చేలోపు నిందితుడు ఆ ప్రాంతం నుంచి పారిపోయాడని ప్రకటనలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: Trump: నైజీరియాలో ఐసిస్‌పై ప్రాణాంతక దాడులు చేశాం.. ఉగ్రవాదులు చనిపోయారన్న ట్రంప్
శివంక్ అవస్థ హత్యపై భారత కాన్సులేట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటన విషాదకరమైన ఘటనగా పేర్కొంది. శివంక్ అవస్థి కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తున్నట్లు టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ తెలిపింది. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు వెల్లడించింది.
News Release – Homicide Investigation, Highland Creek Trail and Old Kingston Road, Victim: Shivank Avasthi, 20, Image Releasedhttps://t.co/WdkKqp4pGe pic.twitter.com/XF6NAYJwgX
— Toronto Police (@TorontoPolice) December 24, 2025
We express deep anguish over the tragic death of a young Indian doctoral student, Mr. Shivank Avasthi, in a fatal shooting incident near the University of Toronto Scarborough Campus. The Consulate is in touch with the bereaved family during this difficult time, and is extending…
— IndiainToronto (@IndiainToronto) December 25, 2025
తాజావార్తలు
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!