NTV Telugu Site icon

Sheikh Hasina: బంగ్లాదేశ్లో షేక్‌ హసీనా పార్టీ కార్యాలయానికి నిప్పు..

Sheike

Sheike

Sheikh Hasina: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా పార్టీతో పాటు సంకీర్ణ సర్కార్ లోని పార్టీలను కష్టాలు వెంటాడుతున్నాయి. ఢాకాలోని హసీనాకు చెందిన అవామీ లీగ్‌ పార్టీ కేంద్ర కార్యాలయంపై దుండగులు దాడి చేశారు. ఆఫీసును ధ్వంసం చేసి, ఆపై నిప్పు పెట్టారు. బంగ్లాదేశ్‌ను 15 సంవత్సరాలు పరిపాలించిన షేక్ హసీనా గత ఆగస్టులో విద్యార్థి ఉద్యమంతో తన ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆమె ప్రస్తుతం భారత్‌లో తలదాచుకుంటున్నారు.

Read Also: Road Accident: కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. 12 మందికి గాయాలు!

కాగా, బంగ్లాదేశ్‌కు 1971లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రిజర్వేషన్ విధానం కొనసాగుతుంది. స్వాతంత్ర్య సమరయోధుల పిల్లలకు 30 శాతం, దేశంలోని వెనుకబడిన జిల్లాల యువతకు 10 శాతం, మహిళలకు 10 శాతం, మైనార్టీలకు 5 శాతం, వికలాంగులకు ఒకశాతం రిజర్వేషన్లు అందిస్తున్నారు. మొత్తంగా బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో 56 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. 2018లో బంగ్లాలోని యువత ఈ రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కొన్ని నెలల పాటు కొనసాగిన నిరసన ఆ తర్వాత.. బంగ్లాదేశ్ సర్కార్ రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

Read Also: Diwali Celebrations: టపాసులు పేలుస్తూ ఆవులను పరుగెత్తించారు.. ఇదో ఆచారమట మరి!

ఇక, 2024 జూన్ 5న బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు పాత రిజర్వేషన్ విధానాన్ని మళ్లీ దేశంలో అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. షేక్ హసీనా సర్కార్ కూడా సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్ చేయగా.. ఆ ఉత్తర్వును ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు బంగ్లాదేశ్‌లోని యూనివర్సిటీల నుంచి మొదలైన ఈ నిరసన ఆ తర్వాత హింసాత్మకంగా మారిపోయింది. ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం యత్నించినప్పటికి అది ఫలించకపోవడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసిన భారత్ పరార్ అయింది.