Sheikh Hasina: ‘‘అప్పగింత’’ ద్వారానే రావాలి.. షేక్ హసీనా రాకపై బంగ్లాదేశ్ యూటర్న్!
- డిసెంబర్ 16న బంగ్లాదేశ్ వెళ్తున్న షేక్ హసీనా..
- నేరస్తుల ‘‘అప్పగింత’’ ద్వారానే హసీనా రావాలంటూ బంగ్లా యూటర్న్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: షేక్ హసీనా తిరిగి వస్తుండటం బంగ్లాదేశ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. డిసెంబర్ 16న తాను బంగ్లాదేశ్ తిరిగి వస్తున్నానని, ఢిల్లీ నుంచి ఢాకాకు ఫ్లైట్ ఏర్పాట్లు చేయాలని బంగ్లా ప్రభుత్వాన్ని ఆమె కోరారు. తన ప్రయాణం కోసం పాస్‌పోర్టు, బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ ఏర్పాట్లను చేయాలని అడిగారు. అయితే, నిన్నటి వరకు హసీనాను వెనక్కి పంపించాలని భారత్‌పై ఒత్తిడి తెచ్చిన బంగ్లాదేశ్‌లోని తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ఇప్పుడు యూటర్న్ తీసుకుంది.
షేక్ హసీనా తన సొంత ఇష్టంతో బంగ్లాదేశ్ తిరిగి రావడానికి వీల్లేదని, భారత్ నేరస్తుల్ని అప్పగింత (ఎక్స్ట్రడిషన్) ప్రక్రియ ద్వారానే తీసుకురావాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. గతంలో హసీనాను బంగ్లాకు పంపించాలని చాలా ఒత్తిడి తెస్తూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బంగ్లాదేశ్ ఇప్పుడు మాత్రం మాట మారుస్తోంది. హసీనా తిరిగి వస్తానని ప్రకటించిన వెంటనే బంగ్లాదేశ్ విదేశాంగ సహాయమంత్రి హుమాయున్ కబీర్ తన ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. ఆమెను ఉగ్రవాదిగా అభివర్ణిస్తూ, నేరస్తుల ‘‘అప్పగింత’’ ప్రక్రియ ద్వారానే బంగ్లాదేశ్‌కు తీసుకురావానలి అన్నారు. ఆమె సాధారణ ప్రయాణికురాలు కాదని, చేతలకు సంకేళ్లు వేసి లేదా కఠిన నిఘా మధ్య మాత్రమే తీసుకురాగలమని అన్నారు. బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తున్నట్లు ఆమె పగటి కలలు కంటోంది” అని కబీర్ వ్యాఖ్యానించారు.
Also Read
- Russia Nuclear Satellite: అంతరిక్షంలో రష్యా అణుబాంబు.. న్యూక్లియర్ శాటిలైట్‌పై ఆందోళన.!
- Pakistan: అసిమ్ మునీర్ ప్లాన్‌పై రగులుతున్న పాకిస్తాన్.. ప్రత్యేక ‘‘సింధు దేశ్’’ కోసం డిమాండ్..
- Nepal Earthquake: నేపాల్‌లో భారీ భూకంపం.. సిక్కిం, బెంగాల్లోనూ ప్రకంపనలు..!
- Iran: హిజాబ్ లేకుండా పాట..74 కొరడా దెబ్బల శిక్ష.. మహిళ గొంతుపై మతాధికారుల మానవ హక్కుల హననం!
హసీనా ఇప్పటికే దోషిగా తేలి శిక్ష పడిన నేరస్థురాలని, ఆమె రాకపై హసీనాతో కాకుండా భారత్‌తోనే చర్చిస్తామని సాంస్కృతిక వ్యవహారాల సలహాదారు జహెద్ ఉర్ రెహమాన్ పేర్కొన్నారు. ఇది కేవలం తన పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు హసీనా ఆడుతున్న నాటకం (బ్లఫ్) అని ఆయన కొట్టిపారేశారు. 1971 డిసెంబర్ 16న పాకిస్తాన్ సైన్యం భారత్, ముక్తి వాహిని ముందు లొంగిపోయి, బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించిన ఈ రోజునే బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టాలని షేక్ హసీనా భావిస్తోంది.
తాజావార్తలు
-
Sheikh Hasina: ‘‘అప్పగింత’’ ద్వారానే రావాలి.. షేక్ హసీనా రాకపై బంగ్లాదేశ్ యూటర్న్!
-
Vishwak Sen: పాతాళంలోకి వెళ్లిపోతున్న నన్ను కాలర్ పట్టుకుని పైకి లాగింది తరుణ్ భాస్కరే.. విశ్వక్ ఎమోషనల్ స్పీచ్!
-
Abhinav Gomatam: నెలకి 30 వేల జాబ్ వదిలేసి ఏడాదికి 30 వేలే సంపాదించా.. అన్నీ అవమానాలే
-
Naga Chaitanya: నా మౌనాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు
-
RC 17 : రామ్ చరణ్ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయింది!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!