Site icon NTV Telugu

Shahid Afridi: “అబద్ధాలు చెప్పినందుకు అవార్డ్”.. షాహిద్ అఫ్రిదికి పాక్ ప్రధాని సత్కారం..

Shahid Afridi

Shahid Afridi

Shahid Afridi: భారత్ చేతిలో చావు దెబ్బలు తిన్నా కూడా పాకిస్తాన్ తమకు ఏం కాలేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌తో పాటు ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ విజయోత్సవాలకు హాజరవుతున్నారు. భారత ‘‘ఆపరేషన్ సిందూర్’’ దాడుల్లో పాకిస్తాన్ 11 ఎయిర్ బేస్‌లు ధ్వంసమయ్యాయి. పీఓకే, పాక్ భూభాగాల్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి, 100 మందిని హతమార్చింది. అయినా కూడా ఏం జరగనట్లు పాకిస్తాన్ తన ప్రజల్ని మోసం చేస్తోంది.

Read Also: Hyderabad: హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం.. భవనంలో చిక్కుకున్న 53 మంది!

ఇదిలా ఉంటే, ఈ గుంపులో ఇప్పుడు పాక్ మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్ కూడా చేశారు. ఇస్లామాబాద్ పాక్ ప్రధాని నివాసంలో జరిగిన సమావేశంలో వీరిద్దరు పాక్ ఆర్మీ నిర్వహించినట్లు చెబుతున్న ‘‘ఆపరేషన్ బన్యానమ్ మర్సూస్’’ విజయవంతంపై పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్‌లను అభినందించారు. షాహిద్ అఫ్రిది పాకిస్తాన్ సైన్యాన్ని కొనియాడారు. ఈ కీలక సమయంలో దేశం మొత్తం ఏకమై శత్రువుకు శక్తివంతమైన సమాధానం ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ షాహిద్ అఫ్రిదికి కృతజ్ఞతలు తెలుపుతూ, పాక్ సైన్యానికి మద్దతుగా నిలిచినందకు, విజయోత్సవ ర్యాలీ తీసినందుకు ప్రశంసించారు.

ఈ సమావేశంలో సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి అత్తౌల్లా తరార్ కూడా పాల్గొన్నారు. పాకిస్తాన్ ప్రధాని ఆఫ్రిదిని ప్రశంసిస్తూ అవార్డుతో సన్మానించారు. అఫ్రిదితో పాటు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు భారత్‌ని విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. వీరికి సంబంధించిన యూట్యూబ్ ఛానెళ్లను, సోషల్ మీడియా అకౌంట్లను భారత్ బ్లాక్ చేసింది. ముఖ్యంగా, షాహిద్ అఫ్రిది భారత్ పై ఉన్న ద్వేషాన్ని ప్రదర్శించారు. కరాచీలో పాక్ సైన్యం భారత్‌పై విజయం సాధించిందని విక్టరీ ర్యాలీ చేశారు. భారత్ సైన్యం మసీదులు, ప్రజలపై దాడులు చేస్తుందని ఆరోపించారు. విదేశాల్లో సిక్కు కార్యకర్తలపై మోడీ ప్రభుత్వం దాడులు చేస్తుందని అబద్ధాలు చెప్పాడు.

Exit mobile version