NTV Telugu Site icon

US: చదువు కోసం వెళ్లి వక్రబుద్ధి.. వ్యభిచారం కేసులో తెలుగోళ్లు అరెస్ట్

Usarrest

Usarrest

వ్యభిచార గృహాలపై అమెరికా పోలీసులు ఉక్కుపాదం మోపారు. పోలీసులు జరిపిన దాడుల్లో ఏడుగురు భారతీయులు అరెస్ట్ అయ్యారు. ఇందులో ఐదుగురు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉండడం విశేషం. ఈ ఘటన అమెరికాలో తీవ్ర కలకలం రేపింది.

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. మంచిగా చదువుకుని.. ఉద్యోగం సంపాదించి మంచి పేరు తెస్తారనుకున్న తల్లిదండ్రులకు పిల్లలు చెడ్డ పేరు తెస్తున్నారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఏపీ, తెలంగాణకు చెందిన ఐదుగురు యువకులు వ్యభిచారం ముఠా సభ్యులుగా ఉండి అరెస్ట్ అవ్వడం కలకలం రేపుతోంది. గలీజ్ పనులు చేస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మొత్తం 18 మందిని డెంటాన్‌ కౌంటీ పోలీసులు అదుపులోకి తీసుకోగా… వీరిలో 14 మంది వ్యభిచారం కేసులో పట్టుబడ్డారు. ఇందులో ఐదుగురు తెలుగువారు ఉండడం ప్రాముఖ్యత సంతరించుకుంది.

టెక్సాస్‌లోని డెంటన్‌లో వ్యభిచారం చేస్తూ ఏడుగురు భారతీయులు అరెస్ట్ అయ్యారని మంగళవారం పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం డెంటన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం వ్యభిచారాన్ని అరికట్టడానికి హాయ్‌ల్యాండ్ విలేజ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ సహకారంతో నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లలో మొత్తం 18 మంది పట్టుబడ్డారని పేర్కొన్నారు అందులో ఏడుగురు భారతీయులు ఉన్నారని చెప్పారు. ఇక అరెస్ట్ అయిన వారిలో తెలుగు యువకులు నిఖిల్ బండి, మోనిష్ గల్లా, నిఖిల్ కుమ్మరి, జైకిరణ్ మేకలా, కార్తీక్ రాయపాటి వారిగా గుర్తించారు. అలాగే అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారని మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోనిష్ గల్లా, కార్తీక్ రాయపాటి డబ్బు ఆశ చూపి వ్యభిచారం చేయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.