Zealandia: ఖండాలు 7 కాదు 8.. 375 ఏళ్ల తర్వాత కనుగొన్న సైంటిస్టులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zealandia భూమిపై ఖండాలెన్ని అని అడిగితే వెంటనే 7, అవి ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా అని చెబుతాం. కానీ 8వ ఖండం కూడా ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. 375 ఏళ్లుగా తప్పిపోయిన ఓ ఖండాన్ని కనుగోన్నారు. అయితే కొత్త ఖండం దాదాపుగా 94 శాతం నీటి అడుగు భాగాన ఉండిపోయింది. జియోలజిస్టులు, సెస్మాలజిస్టులతో కూడిన ఓ పరిశోధన బృందం ‘జిలాండియా లేదా లె రియు-ఎ-మౌయి’ అని పిలువబడే ఖండం మ్యాపును రూపొందించారు. సముద్రం అడుగు భాగంలోని రాళ్ల నమూనాల డేటాను విశ్లేషించడం ద్వారా పరిశోధకులు దీన్ని కనుగొన్నారు. దీనికి సంబంధించిన వివరాలు టెక్టోనిక్స్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.
బీబీసీ ప్రకారం జిలాండియా 4.9 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న విశాలమైన భూభాగం. ఇది మడగాస్కర్ తో పోలిస్తే ఆరు రెట్లు పెద్దది. కొత్తగా కనుగొన్న ఈ కాంటినెంట్ ప్రపంచంలోనే చిన్న, కొత్తదైన ఖండంగా పేరు సంపాదించుకుంది. ఈ ఖండం 94 శాతం నీటిలో ఉంది, న్యూజిలాండ్ మాదిరిగానే ద్వీపాలు ఉన్నాయి.
Also Read
- Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ
- Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
- Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
Read Also: Russia: నార్డ్‌స్ట్రీమ్ పైప్‌లైన్ పేలుడు వెనక యూకే, అమెరికా..రష్యా ఆరోపణలు..
సైంటిస్టుల అభిప్రాయం ప్రకారం జిలాండియాను స్టడీ చేయడం చాలా కష్టం. ప్రస్తుతం సైంటిస్టులు సముద్రం అడుగుభాగంలోని రాళ్లు, అవక్షేప నమూనాలను స్టడీ చేస్తున్నారు. వీటిలో చాలా వరకు డ్రిల్లింగ్ నుంచి కొన్ని ద్వీపాల తీర ప్రాంతాల నుంచి సేకరించారు. ఈ రాతి నమూనాలు పశ్చిమ అంటార్కిటికా, న్యూజిలాండ్ పశ్చిమ తీరంలోని క్యాంప్ బెల్ పీఠభూమి సమీపంలోని సబ్ డక్షన్ జోన్ పోలికను కలిగి ఉన్నాయి. కొత్తగా రూపొందించిన జిలాండియా మ్యాప్ దాని లొకేషన్ ని మాత్రమే కాకుండా, భౌగోళిక లక్షణాలను కూడా చూపుతోంది.
జిలాండియా వాస్తవానికి కొన్ని మిలియన్ ఏళ్ల క్రితం ఉన్న సూపర్ కాంటినెంట్ అయిన గోండ్వానాలో భాగం. ఇది సుమారుగా 550 మిలియన్ ఏళ్ల క్రితం ఏర్పడింది. ఇది దక్షిణార్థ గోళంలో మొత్తం భూమిని కలిపి ఉంది.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!