Israel: బందీలను రక్షించడానికి రెస్కూ ఆపరేషన్.. సిద్దమవుతున్న ప్రత్యేక దళం “సయెరెట్ మత్కల్ “
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ఇజ్రాయిల్‌పై దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులు పలువురు ఇజ్రాయిల్ పౌరులను, ఇతర దేశస్తులను బందీలుగా చేసుకున్నారు. ఇదిలా ఉంటే వీరిని రక్షించేందుకు ఇజ్రాయిల్ సిద్ధమవుతున్నట్లు బ్రిటీష్ పత్రికి ది టెలిగ్రాఫ్ నివేదించింది. దాదాపుగా 100 మంది పౌరులు హమాస్ ఉగ్రవాదులు చెరలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ నిర్వహించేందుకు ప్రపంచంలో అతిశక్తివంతమైన, ఇజ్రాయిల్ ప్రత్యేక ఆపరేషన్స్ దళం ‘సయెరెట్ మత్కల్’ సిద్ధమైనట్లు సమాచారం.
ఇజ్రాయిల్ అధికార వెబ్సైట్ ప్రకారం జనరల్ స్టాఫ్ రికనైసెన్స్ యూనిట్‌ని సయెరెట్ మత్కల్ అని కూడా పిలుస్తారు. ఇది ఫీల్డ్ ఇంటెలిజెన్స్ సేకరించే యూనిట్. శతృవులపై నిఘా నిర్వహిస్తుంది. దీంతో పాటు ఇజ్రాయిల్ వెలుపల కౌంటర్ టెర్రరిజం, బందీలను విడిపించే రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహిస్తుంది. 1990-91 గల్ఫ్ యుద్ధంలో, 1980లో లండన్ లోని ఇరాన్ రాయబార కార్యాలయంలోని బందీలను రక్షించేందుకు బ్రిటీష్ సైన్యం ప్రత్యేక విభాగం స్పెషల్ ఎయిర్ సర్వీస్ లేదా ఎస్ఏఎస్ ఆధారంగా ఈ సయెరెట్ మత్కల్ రూపొందించబడింది.
Also Read
Read Also: TS Election: తెలంగాణ పాలనా వ్యవస్థపై ఈసీ కొరడా.. ఐఏఎస్, ఐపీఎస్‌లపై బదిలీ వేటు
ప్రస్తుతం ఓ వైపు హమాస్ తో యుద్ధం నడుస్తున్నా.. బందీలను రక్షించడం కూడా ఇజ్రాయిల్ బాధ్యతగా ఉంది. మరోవైపు వైమానికి దాడులు ఆపకపోతే బందీలను చంపేస్తామని హమాస్ హెచ్చరిస్తోంది. అయితే సయెరెట్ మత్కల్ యూనిట్ కి సంబంధించి చాలా కార్యకలాపాలు బహిరంగం కాలేదు. 1957లో స్థాపించబడిన ఈ ఎలైట్ గ్రూప్ యోమ్ కిప్పూర్ యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం గాజా వ్యాప్తంగా అంధకారం నెలకొంది. గాజాలోని ఏకైన విద్యుత్ కేంద్రం పనిచేయడం లేదు. ఇప్పటికే ఇజ్రాయిల్ గాజా సరిహద్దుల్ని దిగ్భందించింది. ఆహారం, తాగునీరు, ఇంధనం వంటి వాటిని కట్ చేసింది. గాజా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఇప్పటికే ఇజ్రాయిల్ హెచ్చరించింది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!