Saudi-Yemen: పశ్చిమాసియాలో మరో యుద్ధం.. సౌదీపై యెమెన్ క్షిపణి దాడులు
- పశ్చిమాసియాలో మరో యుద్ధం
- సౌదీపై యెమెన్ క్షిపణి దాడులు
- హౌతీలే లక్ష్యంగా సౌదీ కూడా ప్రతి దాడులు
- మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో కొత్తగా మరో యుద్ధం ప్రారంభమైంది. ఇప్పటికే ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధంతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. ఇప్పుడు తాజాగా మరో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. సౌదీపై యెమెన్ క్షిపణి దాడులు చేసింది. అరాంకో చమురు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసింది. దీంతో మరోసారి పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి.
గత ఐదు నెలలుగా కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావంతో ఇప్పుడు సౌదీ అరేబియా, యెమెన్ కూడా ప్రత్యక్ష ఘర్షణలోకి దిగాయి. శనివారం యెమెన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు సౌదీ అరేబియాలోని యన్బు (Yanbu), జిజాన్ (Jazan) ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. దీంతో అక్కడ భారీ పేలుళ్లు సంభవించగా.. చమురు నిల్వ కేంద్రాల్లో మంటలు చెలరేగినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ దాడులకు ముందు రోజు యెమెన్‌లోని హోదైదా (Hodeidah) ప్రాంతంలో హౌతీ మిలిటరీ స్థావరాలపై సౌదీ వైమానిక దాడులు నిర్వహించినట్లు రియాద్ ప్రకటించింది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలకు ముప్పు కలిగిస్తున్న లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు సౌదీ తెలిపింది.
Also Read
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
- Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్‌కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
- Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
- H-1B Visa: ఉద్యోగం పోతే అమెరికాలో ఉండటం కష్టమేనా? 60 రోజుల గడువు తొలగించే దిశగా ట్రంప్ ప్రభుత్వం
హోదైదాపై సౌదీ దాడులు
యెమెన్‌కు చెందిన అన్సార్ అల్లాహ్ (హౌతీ) గ్రూప్ ఆరోపణల ప్రకారం.. సౌదీ బలగాలు హోదైదా ప్రావిన్స్‌లోని కమరాన్ ద్వీపం (Kamaran Island)తో పాటు టెలికమ్యూనికేషన్ కేంద్రాలపై దాడులు జరిపాయి. అంతర్జాతీయ నివేదికల ప్రకారం.. బాబ్ అల్-మందెబ్ జలసంధికి సమీపంలో ఉండే కమరాన్ ద్వీపం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతం. ఈ మార్గం గుండా సౌదీ చమురు ట్యాంకర్లు ప్రయాణిస్తుంటాయి. ఇటీవల ఈ ప్రాంతంలో జరిగిన దాడుల నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
అరాంకో చమురు కేంద్రాలే లక్ష్యం
సౌదీ తమ నియంత్రణలోని ప్రాంతాలపై దాడులు కొనసాగిస్తే.. ఎర్ర సముద్రంలోని చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలతో పాటు సౌదీ అరాంకో చమురు కేంద్రాలు, విమానాశ్రయాలు, వైమానిక స్థావరాలు, చమురు పైప్లైన్లను లక్ష్యంగా చేసుకుంటామని హౌతీలు ఇప్పటికే హెచ్చరించారు. ‘‘ఓడరేవుకు బదులుగా ఓడరేవు.. విమానాశ్రయానికి బదులుగా విమానాశ్రయం.. ప్రతి దాడికి అంతకంటే తీవ్ర ప్రతిస్పందన ఉంటుంది.’’ అని హౌతీ గ్రూప్‌కు చెందిన ఓ సీనియర్ నేత హెచ్చరించినట్లు విదేశీ మీడియా పేర్కొంది.
ఇరాన్‌కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం.. యెమెన్ క్షిపణి దాడుల అనంతరం యన్బు, జిజాన్ ప్రాంతాల్లో భారీగా పొగలు ఎగిసిపడుతున్న దృశ్యాలు కనిపించాయి. నాసా ఉపగ్రహ చిత్రాల ప్రకారం.. జిజాన్‌లోని సౌదీ అరాంకో చమురు నిల్వ ట్యాంకుల్లో అగ్నిప్రమాదం సంభవించినట్లు వెల్లడైంది. ఇక దాడుల అనంతరం యన్బు, జిజాన్ విమానాశ్రయాల్లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. సౌదీ గగనతలంలోని కొన్ని ప్రాంతాల్లో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడగా.. పలువురు విమానాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించినట్లు సమాచారం. అలాగే యెమెన్ నుంచి తెల్లవారుజామున జరిగిన ఈ ఆకస్మిక దాడుల నేపథ్యంలో దక్షిణ సౌదీ ప్రాంతాల్లోని ప్రజలకు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం పరిస్థితిని సౌదీ భద్రతా బలగాలు నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి.
🎥 ستونهای دود همچنان در آسمان شهر جیزان عربستان دیده میشود. https://t.co/NEAq3aeJ3i pic.twitter.com/rTnfcZyzDW
— خبرگزاری فارس (@FarsNews_Agency) July 25, 2026
🎥 توقف فعالیت فرودگاههای جازان و ینبع عربستان پساز حملات یمن
در پی حملات یمن به تأسیسات نفتی آرامکو، فعالیت فرودگاههای ینبع و جازان موقتاً متوقف شد.
همزمان دادههای رهگیری پرواز از اختلال در بخشی از ترافیک هوایی عربستان و تغییر مسیر یا زمان پرواز برخی هواپیماها خبر میدهد. https://t.co/CzPmsjLRo9 pic.twitter.com/RyigGNMP8E
— خبرگزاری فارس (@FarsNews_Agency) July 25, 2026
- Tags
- missile Attack
- saudi
- Yemen
తాజావార్తలు
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
-
Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
-
Harish Rao : కేసీఆర్ పాలనలో పరిష్కారాలు.. రేవంత్ సర్కార్‌లో సమస్యలే
-
Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?