Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
- మక్కాలో ప్రమాద హెచ్చరిక జారీ
- అప్రమత్తంగా ఉండాలని సౌదీ వార్నింగ్
- 10 రోజుల్లో రెండోసారి హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌదీ అరేబియాలోని పవిత్ర నగరం మక్కాలో మరోసారి ‘ప్రమాదం పొంచి ఉంది’ అంటూ అధికారిక హెచ్చరిక జారీ అయింది. సౌదీ సివిల్ డిఫెన్స్ గురువారం మక్కా నగరంతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు నేషనల్ ఎర్లీ వార్నింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా అలర్ట్‌లు జారీ చేసింది. ఈ హెచ్చరికలు సాధారణంగా క్షిపణి లేదా డ్రోన్ ముప్పు ఉన్నప్పుడు జారీ చేసే హెచ్చరికలకు సంబంధించినవిగా భావిస్తారు.
10 రోజుల్లో రెండోసారి..
మక్కాలో ఇలాంటి హెచ్చరిక రావడం 10 రోజుల వ్యవధిలో రెండోసారి. సెప్టెంబర్ 18న కూడా మక్కాతో పాటు పలు ప్రాంతాల్లో సౌదీ అధికారులు ‘ప్రమాదం’ హెచ్చరికలు జారీ చేశారు. తాజా అలర్ట్‌లో మక్కాతో పాటు జెడ్డా, యన్బు, తాయిఫ్, తబూక్ ప్రాంతాలు కూడా ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని సివిల్ డిఫెన్స్ సూచించింది. అలర్ట్ వచ్చిన సమయంలో ప్రజలు భవనాల్లోనే ఉండాలని, కిటికీలు, గాజు తలుపులకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. బహిరంగ ప్రదేశాలు, బాల్కనీలు, పైకప్పులపైకి వెళ్లకూడదని, బయట ఉన్నవారు సమీపంలోని సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని సూచించారు. అలాగే ప్రమాద ప్రాంతాల్లో గుమిగూడడం, వీడియోలు తీయడం వంటివి చేయొద్దని హెచ్చరించారు.
Also Read
- Bangladesh Violence: హింస గుప్పిట్లో బంగ్లాదేశ్.. మహ్మద్ యూనస్ ఇంటికి నిప్పు.. దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లు!
- Xi Jinping Welcomes Trump: ట్రంప్‌కు జిన్‌పింగ్ గ్రాండ్ వెల్కమ్.. ప్రోటోకాల్ పక్కనపెట్టి ఆలింగనం! వైరల్‌గా వీడియో
- Muslim Population 2035: 2035 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా ఇస్లాం?.. ప్యూ రీసెర్చ్ సంచలన అంచనాలు!
- Ukraine: ‘‘పుతిన్‌ను బుజ్జగించడం కన్నా ఇలా చేయండి’’..ట్రంప్, జిన్పింగ్లకు ఉక్రెయిన్ విజ్ఞప్తి
ఇదే సమయంలో యెమెన్‌లోని హౌతీల నుంచి వచ్చిన ఆరు బాలిస్టిక్ క్షిపణులను సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్లు సౌదీ నేతృత్వంలోని కూటమి ప్రకటించింది. తాయిఫ్, యన్బు నగరాలను లక్ష్యంగా చేసుకుని ఈ క్షిపణులు ప్రయోగించినట్లు కూటమి ప్రతినిధి టుర్కీ అల్-మాలికీ తెలిపారు. హౌతీల నుంచి దాడుల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ అప్రమత్తంగా ఉన్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. అయితే మక్కాపై జారీ చేసిన తాజా హెచ్చరికకు నేరుగా ఈ క్షిపణి ప్రయోగాలే కారణమని సౌదీ అధికారులు అధికారికంగా వెల్లడించలేదు.
సెప్టెంబర్ 18న మక్కా వైపు హౌతీలు డ్రోన్‌ను ప్రయోగించారని సౌదీ అరేబియా ఆరోపించింది. ఆ డ్రోన్‌ను అడ్డుకున్నట్లు కూడా ప్రకటించింది. 2017 తర్వాత మక్కాను లక్ష్యంగా చేసుకున్న తొలి ప్రయత్నం ఇదేనని సౌదీ అధికారులు పేర్కొన్నారు. అయితే హౌతీలు ఈ ఆరోపణలను ఖండించారు. ఆ తర్వాత సెప్టెంబర్ 19న సౌదీ రాజధాని రియాద్‌ను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం జరిగిందని సౌదీ అధికారులు తెలిపారు. ఆ క్షిపణిని సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
మళ్లీ ఉద్రిక్తత
యెమెన్‌లోని హౌతీలు, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న సౌదీ నేతృత్వంలోని కూటమి మధ్య చాలా కాలంగా ఘర్షణ కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో సౌదీ నగరాలు, చమురు మౌలిక సదుపాయాలు, నౌకాయాన మార్గాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడుల ఆరోపణలు పెరిగాయి. ముఖ్యంగా బాబ్ అల్-మందబ్ జలసంధి పరిసర ప్రాంతాలు, ఎర్ర సముద్ర మార్గాలు సౌదీ చమురు ఎగుమతులకు కీలకంగా ఉండటంతో.. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడం అంతర్జాతీయ నౌకాయానంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. తాజా హెచ్చరికలు కొద్ది నిమిషాల తర్వాత ఉపసంహరించబడ్డాయని నివేదికలు తెలిపాయి. మక్కా, తాయిఫ్, తబూక్ ప్రాంతాల్లో ప్రమాదం తొలగిపోయినట్లు సౌదీ సివిల్ డిఫెన్స్ అనంతరం ‘ఆల్ క్లియర్’ ప్రకటించింది.
అయితే వరుసగా మక్కా, రియాద్ సహా సౌదీలోని పలు ప్రాంతాలకు హెచ్చరికలు రావడం, హౌతీల క్షిపణి, డ్రోన్ కార్యకలాపాలు పెరగడం నేపథ్యంలో సౌదీ-యెమెన్ ఘర్షణ మరోసారి తీవ్రతరం అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
تم إطلاق إنذار من المنصة الوطنية للإنذار المبكر في حالات الطوارئ في مدينة مكة المكرمة للتحذير من خطر، اتبع الآتي:
A warning has been issued by the National Early Warning Platform in Mecca City to alert of a potential danger. Please follow the instructions below: https://t.co/8YtJcQ1zxb
— الدفاع المدني السعودي (@SaudiDCD) September 24, 2026
తాజావార్తలు
-
Jasprit Bumrah Bowling: బుమ్రా మ్యాజిక్ బాల్.. నోరెళ్లబెట్టిన కివీస్ కెప్టెన్.. వీడియో చూడాల్సిందే!
-
Hyundai Neira Electric MPV: 51.4 kWh బ్యాటరీ, 490KM రేంజ్‌తో హ్యుందాయ్ కొత్త 7 సీటర్ EV..
-
PM Modi: మాజీ ప్రధాని ఇందిరా గాంధీని స్మరించుకున్న ప్రధాన మంత్రి మోడీ..
-
Yuzvendra Chahal Creates History: చరిత్ర సృష్టించిన చాహల్… టీ20 హిస్టరీలో ఒకే ఒక్కడు..!
-
Gold Adulteration Alert: బంగారం కొనేవారికి బిగ్ అలర్ట్.. పసిడిలో రీనియం పౌడర్ కల్తీ?.. 24 క్యారెట్స్ పరీక్షలోనూ పాస్!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..