ఇస్త్వాన్ స్జాబో, మార్టిన్ స్కోర్సెస్‌కు సత్యజిత్ రే అవార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సత్యజిత్ రే లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుని కేంద్రం ప్రకటించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అనురాగ్ ఠాకూర్ అవార్డు వివరాలను వెల్లడించారు. ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్లు మార్టిన్ స్కోర్సెస్, ఇస్టావెన్ స్జాబోలకు అవార్డులు అందచేస్తామని తెలిపారు. ఈ ఏడాది నవంబర్ 20 నుంచి 28 వరకూ గోవాలో జరిగే 52వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డులు అందచేస్తామన్నారు.
మార్టిన్ స్కోర్సెస్, ఇస్టావెన్ స్జాబోలు సినిమా రంగంలో తనదైన ముద్ర వేశారు. స్కోర్సెస్ అనేక అవార్డు సినిమాలు తీశారు. ట్యాక్సీ డ్రైవర్, గుడ్ ఫెల్లాస్ సినిమాలకు ఆస్కార్ అవార్డులు దక్కాయి. హంగేరియన్ ఫిల్మ్ డైరెక్టర్ ఇస్టావెన్ జాబో మెఫిస్టో వంటి అకాడమీ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
Also Read
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్‌తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
ఇఫ్పీ అవార్డుల విభాగంలో యువత ప్రతిభకు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు. దర్శకత్వం, నటన, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ప్రొడక్షన్, ఓటీటీ విభాగాల్లో వారికి శిక్షణ ఇస్తామన్నారు. 75 ఏళ్ళ భారత స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటున్న వేళ 75 విభాగాల్లో 35 ఏళ్ళ వయసున్న యువతీ, యువకులకు నిపుణుల ద్వారా శిక్షణా తరగతులు అందిస్తామన్నారు మంత్రి అనురాగ్ ఠాకూర్.
అందులో పాల్గొనబోయే వారిని జ్యూరీ ఎంపికచేస్తుందన్నారు మంత్రి. వారి ఇండస్ట్రీలో లబ్ధ ప్రతిష్టుల ద్వారా శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. కరోనా నేపథ్యంలో థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూడలేనివారికి ఓటీటీలు మంచి వినోద సాధనంగా మారాయన్నారు. ఎన్నడూ లేని విధంగా BRICS (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాలకు చెందిన ఫిల్మ్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తామన్నారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.
తాజావార్తలు
-
Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా ‘పెద్ది’ దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
-
UPI Transactions: యూపీఐ సేవలు ఉచితం కాదు.. ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
-
Srisailam Water Release: గుడ్‌న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
-
Rahul Gandhi: రాహుల్‌గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!