Site icon NTV Telugu

Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి.. తగలబడిన పలు భవంతులు

Russiaukraine

Russiaukraine

రష్యా-ఉక్రెయిన్ వెనుక యుద్ధాలు మొదలు పెట్టిన దేశాలన్నీ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాయి. కాల్పుల విరమణతో శాంతి వాతావరణం చోటుచేసుకున్నాయి. ఇరాన్-గాజా-ఇజ్రాయెల్ దేశాల మధ్య ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది. అలాగే భారత్-పాకిస్థాన్ మధ్య కూడా నెమ్మదిగానే ఉంది. కానీ రష్యా-ఉక్రెయిన్ మధ్య మాత్రం ఇంకా యుద్ధం చల్లారలేదు.. నిత్యం కాల్పులతో ఇరు దేశాలు దద్దరిల్లుతున్నాయి. తాజాగా శుక్రవారం తెల్లవారుజామున ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి ప్రయోగించింది. నివాసాల మధ్య దాడి చేయడంతో పలు భవంతులు తగలబడ్డాయి.

ఇది కూడా చదవండి: Hyderabad : హైదరాబాద్‌ గతిని ఫోర్త్ సిటీ మార్చేస్తుందా..? సాఫ్ట్‌వేర్, రియల్ ఎస్టేట్‌లో తిరుగుండదా?

ఉక్రెయిన్‌లోని కైవ్ విమానాశ్రాయానికి రష్యన్ దళాలు నిప్పుపెట్టాయి. అలాగే నివాసాలపై డ్రోన్, క్షిపణులను ప్రయోగించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దాదాపు 6 గంటల పాటు ఈ దాడులు జరిగినట్లు సమాచారం. 13 ప్రదేశాల్లో ఈ దాడి ప్రభావం కనిపించింది. శుక్రవారం తెల్లవారుజామున కైవ్‌పై రష్యన్ దళాలు పెద్ద ఎత్తున డ్రోన్, క్షిపణి దాడిని ప్రారంభించాయని.. నివాస ప్రాంతాలపై దాడి చేయడంతో మంటలు చెలరేగాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఇక మృతుల సంఖ్య అంచనా వేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Tollywood : తెలుగులో సెటిలైపోయిన పరభాష స్టార్ హీరో

ఉత్తర శివారులోని 16 అంతస్తుల అపార్ట్‌మెంట్ భవనం పైకప్పుపై మంటలు చెలరేగినట్లు మేయర్ విటాలి క్లిట్ష్కో తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడిన కొన్ని గంటలకే ఉక్రెయిన్ రాజధానిపై దాడి జరిగింది. జనవరిలో ట్రంప్ రెండోసారి వైట్ హౌస్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరు నాయకుల మధ్య సంభాషణ జరగడం ఇది ఆరోసారి.

 

Exit mobile version