Site icon NTV Telugu

Putin: పుతిన్ ఇంటిపై దాడి చేసిన ఉక్రెయిన్ డ్రోన్ వీడియో రిలీజ్..

Putin

Putin

Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంటిపై ఇటీవల ఉక్రెయిన్ డ్రోన్‌తో దాడి చేసినట్లు క్రెమ్లిన్ ఆరోపించింది. నోవ్‌గోరోడ్ ప్రాంతంలోని పుతిన్ ఇంటిపై ఈ దాడి జరిగినట్లు రష్యా ఆరోపించింది. అయితే, ఆ సమయంలో పుతిన్ ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని రష్యన్ అధికారులు బయటపెట్టలేదు. బుధవారం రక్షణ మంత్రిత్వ శాఖ దాడికి పాల్పడిన, కూల్చివేసిన ఉక్రెయిన్ డ్రోన్ వీడియోను విడుదల చేసింది.

Read Also: Mollywood 2025: నెవ్వర్ బిఫోర్ హైస్.. 96 ఏళ్ల మాలీవుడ్ చరిత్రను మార్చిన కళ్యాణి!

అటవీ ప్రాంతంలో మంచులో పడి, దెబ్బతిన్న డ్రోన్‌లా కనిపిస్తోంది. ఈ దాడి పుతిన్‌ను టార్గెట్ చేసి, అత్యంత జాగ్రత్తగా ప్లాన్ చేసి, దశల వారీగా చేసిన దాడిలా కనిపిస్తోందని రష్యన్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ డ్రోన్ దాడి ద్వారా మానవ శక్తిని, పౌర మౌలిక వసతులను ధ్వంసం చేయడానికి ప్లాన్ చేశారని, దీని లక్ష్యం నోవ్‌గోరోడ్ ప్రాంతంలోని వాల్తై జిల్లాలో ఒక రక్షిత సదుపాయం అని వీడియోలో తెలిపారు.

ఫ్లోరిడాలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమైన నేపథ్యంలో ఈ దాడి జరిగింది. కైవ్ ఈ దాడిని “అబద్ధం”గా అభివర్ణించింది, ఇది శాంతి ప్రక్రియను “తారుమారు చేయడానికి” ఉద్దేశించిన “కల్పితం కథ” అని చెప్పింది. ఈ వీడియో శాంతి ప్రయత్నాలను “తప్పుదోవ పట్టించే” ప్రయత్నం అని యూరోపియన్ యూనియన్ కూడా పేర్కొంది. రష్యా ఈ సంఘటనను ఉగ్రవాద దాడిగా, పుతిన్‌పై వ్యక్తిగత దాడిగా చెప్పింది.

Exit mobile version