Site icon NTV Telugu

Russia Ukraine War: పుతిన్ హెచ్చరిక.. ఉక్రెయిన్ లొంగిపోయే వరకు యుద్ధం చేస్తాం

ఒక పథకం, షెడ్యూల్‌ ప్రకారం ఉక్రెయిన్‌పై రష్యా మిలటరీ చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌ కొనసాగుతుందని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. పోరాటం ఆపి లొంగిపోయే వరకు, తమ డిమాండ్లు నెరవేరే వరకు యుద్ధం కొనసాగిస్తామని ఉక్రెయిన్‌ను ఉద్దేశించి హెచ్చరించారు. మూడో దఫా జరిగే శాంతి చర్చల్లో నిర్మాణాత్మక విధానాన్ని అవలంభించడం మంచిదని ఉక్రెయిన్‌కు పుతిన్ సూచించారు.

కాగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ ఆదివారం సుదీర్ఘంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ తీరుపై పుతిన్‌ మండిపడ్డారు. రష్యా దళాలు చుట్టుముట్టిన పోర్టు నగరమైన మరియుపోల్‌లో కాల్పులు విరమించినప్పటికీ పౌరులను తరలించడంలో ఉక్రెయిన్‌ విఫలమైందని పుతిన్ విమర్శించారు. విదేశీయులను బంధీలుగా చేసుకునేందుకు ఉద్దేశ పూర్వకంగానే ఉక్రెయిన్‌ ఇలా వ్యవహరించిందని పుతిన్‌ ఆరోపించారు.

Exit mobile version