Site icon NTV Telugu

Ukraine Russia War: కీలక ప్రకటన చేయనున్న పుతిన్‌.. ఇక విధ్వంసమే..!

ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇప్పుడు ఉక్రెయిన్‌ ఆక్రమ‌ణ‌ను అధికారికంగా ప్రక‌టించే అవకాశం ఉందని తెలుస్తోంది.. మే 9వ తేదీలోగా ఉక్రెయిన్‌పై అధికారికంగా పుతిన్ యుద్ధం ప్రక‌టించే అవ‌కాశాలు ఉన్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఈ చ‌ర్యలో భాగంగా ర‌ష్యా త‌న పూర్తి సైన్యాన్ని ఉక్రెయిన్ భూభాగంలోకి దించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మే 9వ తేదీన విక్ట‌రీ డేను ర‌ష్యా జ‌రుపుకుంటోంది. 1945లో ఆ రోజున నాజీల‌ను ర‌ష్యా ఓడించింది. ఆ రోజున ఉక్రెయిన్‌లో సాధించిన సైనిక చ‌ర్య ఫ‌లితాల‌ను పుతిన్ వెల్ల‌డించే అవ‌కాశాలు ఉన్నాయి. ప్ర‌త్యేక మిలిట‌రీ ఆప‌రేష‌న్ పేరుతో ఫిబ్ర‌వ‌రి 24వ తేదీన ర‌ష్యా ఉక్రెయిన్‌పై దాడికి దిగింది. ఐతే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్నట్లు కానీ, ఆక్ర‌మ‌ణ‌కు వెళ్లిన‌ట్లు కానీ పుతిన్ అధికారికంగా ప్రకటించలేదు.

Read Also: Jodhpur clashes: జోధ్‌పూర్‌ ఘర్షణలు.. చర్యలకు కేంద్రమంత్రి డిమాండ్‌

ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ ఓ యూదుడు కావ‌డం వ‌ల్ల.. ఆ దేశంపై డీనాజిఫికేష‌న్‌లో భాగంగా దాడి చేప‌ట్టిన‌ట్లు కూడా పుతిన్ వెల్ల‌డించారు. మే 9వ తేదీన పుతిన్ చేసే ప్ర‌క‌ట‌న‌తో ఆ దేశం త‌న రిజ‌ర్వ్ ద‌ళాల‌ను యుద్ధ రంగంలోకి దించే అవ‌కాశాలు ఉన్నాయి. గ‌త రెండు నెల‌లుగా సాగుతున్న వార్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ది వేల మంది ర‌ష్యా సైనికులు చ‌నిపోయి ఉంటార‌ని ప‌శ్చిమ‌, ఉక్రెయిన్ దేశ అధికారులు అంచ‌నా వేస్తున్నారు. రష్యా దండయాత్రతో అట్టుడికిపోతున్న ఉక్రెయిన్‌ సరిహద్దు దేశానికి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ సతీమణి త్వరలో రానున్నారు. ఉక్రెయిన్‌ నుంచి తలదాచుకోవడానికి ఆ దేశానికి వచ్చిన తల్లులను మదర్స్‌డే సందర్భంగా ఆమె కలుస్తారు. ఈ విషయాన్ని అమెరికా అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి. మొత్తానికి.. ఉక్రెయిన్‌పై పుతిన్‌ అధికారిక ప్రకటన చేసే చాన్స్ ఉంది.

Exit mobile version