NTV Telugu Site icon

India-Russia: భారత్ కు రెండో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా రష్యా

Impact Of Oil Prices Crude Oil

Impact Of Oil Prices Crude Oil

ఉక్రెయిన్ తో యుద్ధం కారణంగా రష్యా అనేక ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా చమురు, గ్యాస్ కొనుగోలుపై పలు పాశ్చాత్య దేశాలు నిషేధాన్ని విధిస్తున్నాయి. దీంతో రష్యా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే అనేక మల్టీ నేషనల్ కంపెనీలు రష్యా నుంచి వైదొలుగుతున్నాయి. ఎన్ని ఆంక్షలు విధించినా ఉక్రెయిన్ పై దాడిని ఆపడం లేదు రష్యా.

ఇదిలా ఉంటే భారత్ కు అతి తక్కువ రేటుకే రష్య చమురును ఆఫర్ చేసింది. దీంతో ఇండియా కూడా రష్యా వద్ద నుంచి క్రూడ్ ఆయిన్ ను దిగుమతి చేసుకుంటోంది. ఒక సందర్భంలో  రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతిని కొన్ని పాశ్చత్య దేశాలు వ్యతిరేకించాయి. అయితే భారత విదేశాంగ మంత్రి జైశంకర్ యూరప్ కొనుగోలు చేస్తున్న దాని కన్నా అతి తక్కవ చమురునే కొనుగోలు చేస్తున్నామని కౌంటర్ ఇచ్చారు.

తాజాగా మే నెలలో భారత్ కు చమురు ఎగుమతి చేస్తున్న దేశాల్లో రెండో అతిపెద్ద దేశంగా రష్యా నిలిచింది. అతి తక్కువ రేటుకే చమురును ఆఫర్ చేయడంతో భారత రిఫైనర్లు రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాయి. మే నెలలో భారత రిఫైనరీలు రోజుకు 819,000 బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకున్నాయి. భారత్ కు చమురును ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఇరాక్ మొదటిస్థానంలో ఉండగా.. రష్యా రెండో స్థానంలో, సౌదీ అరేబియా మూడో స్థానంలో ఉన్నాయి. మే నెలలో భారత్ కు దిగుమతి అయిన చమురులో రష్యా 16.5 వాటాను కలిగి ఉంది. మే నెలలో ఇండియా చమురు దిగుమతి మొత్తం 4.98 మిలియన్ బీపీడీ(బ్యారెల్స్ పర్ డే)గా ఉంది. 2020 డిసెంబర్ నుంచి ఇదే అధికం. మేనెలలో చమురు దిగుమతులు గత నెల కన్నా 5.6 శాతం పెరిగాయి. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 19 శాతం అధికం.