Joe Biden – Rishi Sunak: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి వార్తల్లో నిలిచారు. గుడ్ ఫ్రైడే శాంతి ఒప్పందం 25వ వార్షికోత్సవం సందర్భంగా జో బైడెన్ మంగళవారం యూకేలోని ఉత్తర ఐర్లాండ్ పర్యటనకు వెళ్లారు. అయితే ఈ సమయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆయనకు స్వాగతం పలికేందుకు బెల్‌ఫాస్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న సమయంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు అగ్రదేశాల నేతల పర్యటనలో ఒకరినొకరు పట్టించుకోని సంఘటనలు ఎప్పుడైనా చూశామా.? కానీ తాజాగా యూకే పర్యటనలో ఉన్న జో బైడెన్, రిషి సునాక్ ఎవరు..? అన్న తీరులో ప్రవర్తించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: Atiq Ahmed: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌కి పాకిస్తాన్ ఐఎస్ఐ, లష్కరే తోయిబాతో సంబంధాలు..
🤣
Joe Biden pushes Rishi Sunak out the way to greet someone else as he didn’t recognize the UK PM
— Russian Market (@runews) April 12, 2023
జో బైడెన్ రిషి సునాక్ ను గుర్తు పట్టలేకపోయాడా..? అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో జో బైడెన్ వేరేవాళ్లను పలకరించే సమయంలో రిషి సునాక్ ను పెద్దగా పట్టించుకోనట్లు కనిపిస్తోంది. సునాక్ ను పక్కకు ఉంచి వేరే ఒక అధికారికి సెల్యూట్ చేశారు. బైడెన్ పూర్వీకులు ఐర్లాండ్ ప్రాంతానికి చెందిన వారు. 80 ఏళ్ల బైడెన్ ఐర్లాండ్ తన ఆత్మలో భాగం అని గతంలో కొన్నిసార్లు వ్యాఖ్యానించారు. ఈ పర్యటనలో ఆయన 19వ శతాబ్ధంలో తన పూర్వీకులు ఉన్న ప్రాంతాలను సందర్శించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల అధినేతల మద్య ఆ తర్వాత మీటింగ్ జరిగింది.
