Canada: ట్రూడోకు ఖలిస్థానీలు షాక్.. లిబరల్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం!
- కెనడా ప్రధాని ట్రూడో ప్రభుత్వానికి ఎన్‌డీపీ నేత జగ్మీత్‌సింగ్ షాక్..
- జస్టిన్ ట్రూడో ప్రధానిగా బాధ్యతలు నిర్వహించడంలో విఫలమయ్యారు..
- ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎన్‌డీపీ రెడీగా ఉంది: జగ్మీత్‌సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada: కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోకు ఖలిస్థానీ మద్దతుదారు, నేషనల్ డెమోక్రటిక్ పార్టీ నేత జగ్మీత్‌సింగ్ గట్టి షాకిచ్చారు. ట్రూడో లిబరల్ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామన్నారు. కెనడియన్ ప్రజలను ఉద్దేశిస్తూ ఆయన రాసిన ఓ లేఖను ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. జస్టిన్ ట్రూడో ప్రధానిగా బాధ్యతలు నిర్వహించడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. ప్రజల కోసం కాకుండా.. శక్తిమంతుల కోసం వర్క్ చేస్తున్నారని ఆయన రాసుకొచ్చారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎన్‌డీపీ రెడీగా ఉంది.. కెనడియన్లకు తమ కోసం పని చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకొనే ఛాన్స్ కల్పిస్తామని జగ్మీత్‌సింగ్ తెలిపారు.
Read Also: US Government: డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనలను తిరస్కరించిన కాంగ్రెస్..
Also Read
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్‌టాక్ సృష్టికర్త..
- Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
- Pakistan: పాకిస్తాన్‌ను మెచ్చుకున్న ఎలాన్ మస్క్.. గ్యాంగ్‌రేప్ దోషులకు ఉరిశిక్షపై ప్రశంసలు
అలాగే, హౌస్ ఆఫ్ కామన్స్ తదుపరి భేటీలో అవిశ్వాస తీర్మానాన్ని ముందుకు తీసుకు వస్తామని నేషనల్ డెమోక్రటిక్ పార్టీ నేత జగ్మీత్‌సింగ్ పేర్కొన్నారు. ఈ అవిశ్వాస తీర్మానానికి అన్ని పార్టీల సపోర్ట్ లభిస్తే.. 9 ఏళ్ల ట్రూడో పాలన ముగియనుందన్నారు. అయితే, ఈ లేఖపై అధికార ప్రభుత్వం ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. ఆ దేశ ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రిలాండ్ ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. మంత్రివర్గంలో అత్యంత శక్తిమంతురాలిగా గుర్తింపు పొందిన ఆమె.. జస్టిన్ ట్రూడో ప్రజాదరణ కోల్పోతున్నారని ఆరోపణలు చేసింది. కాగా, ఆమె నిర్వహిస్తున్న ఆర్థికశాఖను మారుస్తున్నట్లు ట్రూడో చెప్పడంతో క్రిస్టియా.. తన పదవికి రాజీనామా చేసింది.
Read Also: Manipur: మణిపూర్లో తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ కోసం 2,000 మందితో గాలింపు..
కాగా, యూఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్.. సరిహద్దులో వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాను కట్టడి చేయకుంటే కెనడాపై అధిక పన్నులు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇందులో విఫలమైతే అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని ట్రూడోను హెచ్చరించారు. అయితే, ఈ విషయాల్లో ట్రూడో సరిగ్గా స్పందించడం లేదని సొంత పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల విశ్వాస పరీక్షలో ట్రూడో సర్కారు ఎన్‌డీపీ సపోర్టుతో గట్టెక్కింది. మరోవైపు, ఖలిస్థానీ వేర్పాటువాదానికి జగ్మీత్‌సింగ్ బలమైన మద్దతుదారుగా కొనసాగుతున్నారు.. ఆయన్ను ప్రసన్నం చేసుకోవడం కోసమే ట్రూడో భారత్‌తో విభేదాలు కొనసాగించారు. ఈ క్రమంలోనే ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలతో పాటు మిత్రపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలు జస్టిన్ ట్రూడో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు సర్వేలు తెలియజేస్తున్నాయి.
తాజావార్తలు
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్‌లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్‌నెస్‌పై కోచ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!