NTV Telugu Site icon

Canada: ట్రూడోకు జగ్మీత్‌సింగ్ షాక్.. లిబరల్‌ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం!

Trudo

Trudo

Canada: కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోకు ఖలిస్థానీ మద్దతుదారు, నేషనల్ డెమోక్రటిక్‌ పార్టీ నేత జగ్మీత్‌సింగ్ గట్టి షాకిచ్చారు. ట్రూడో లిబరల్‌ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామన్నారు. కెనడియన్ ప్రజలను ఉద్దేశిస్తూ ఆయన రాసిన ఓ లేఖను ఎక్స్‌ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. జస్టిన్ ట్రూడో ప్రధానిగా బాధ్యతలు నిర్వహించడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. ప్రజల కోసం కాకుండా.. శక్తిమంతుల కోసం వర్క్ చేస్తున్నారని ఆయన రాసుకొచ్చారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎన్‌డీపీ రెడీగా ఉంది.. కెనడియన్లకు తమ కోసం పని చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకొనే ఛాన్స్ కల్పిస్తామని జగ్మీత్‌సింగ్ తెలిపారు.

Read Also: US Government: డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనలను తిరస్కరించిన కాంగ్రెస్..

అలాగే, హౌస్ ఆఫ్‌ కామన్స్‌ తదుపరి భేటీలో అవిశ్వాస తీర్మానాన్ని ముందుకు తీసుకు వస్తామని నేషనల్ డెమోక్రటిక్‌ పార్టీ నేత జగ్మీత్‌సింగ్ పేర్కొన్నారు. ఈ అవిశ్వాస తీర్మానానికి అన్ని పార్టీల సపోర్ట్ లభిస్తే.. 9 ఏళ్ల ట్రూడో పాలన ముగియనుందన్నారు. అయితే, ఈ లేఖపై అధికార ప్రభుత్వం ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. ఆ దేశ ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రిలాండ్‌ ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. మంత్రివర్గంలో అత్యంత శక్తిమంతురాలిగా గుర్తింపు పొందిన ఆమె.. జస్టిన్ ట్రూడో ప్రజాదరణ కోల్పోతున్నారని ఆరోపణలు చేసింది. కాగా, ఆమె నిర్వహిస్తున్న ఆర్థికశాఖను మారుస్తున్నట్లు ట్రూడో చెప్పడంతో క్రిస్టియా.. తన పదవికి రాజీనామా చేసింది.

Read Also: Manipur: మణిపూర్లో తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ కోసం 2,000 మందితో గాలింపు..

కాగా, యూఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌.. సరిహద్దులో వలసలు, డ్రగ్స్‌ అక్రమ రవాణాను కట్టడి చేయకుంటే కెనడాపై అధిక పన్నులు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇందులో విఫలమైతే అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని ట్రూడోను హెచ్చరించారు. అయితే, ఈ విషయాల్లో ట్రూడో సరిగ్గా స్పందించడం లేదని సొంత పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల విశ్వాస పరీక్షలో ట్రూడో సర్కారు ఎన్‌డీపీ సపోర్టుతో గట్టెక్కింది. మరోవైపు, ఖలిస్థానీ వేర్పాటువాదానికి జగ్మీత్‌సింగ్‌ బలమైన మద్దతుదారుగా కొనసాగుతున్నారు.. ఆయన్ను ప్రసన్నం చేసుకోవడం కోసమే ట్రూడో భారత్‌తో విభేదాలు కొనసాగించారు. ఈ క్రమంలోనే ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలతో పాటు మిత్రపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలు జస్టిన్ ట్రూడో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు సర్వేలు తెలియజేస్తున్నాయి.

Show comments