NTV Telugu Site icon

Germany: జర్మనీ వ్యాప్తంగా భారీగా రైడ్స్.. ఇస్లామిక్ సంస్థలు, హిజ్బుల్లా టార్గెట్‌గా సోదాలు..

Germany

Germany

Germany: ఇటీవల కాలంలో యూరప్ లోని పలు దేశాల్లో ఇస్లామిక్ తీవ్రవాదం చాపకింద నీరులా పెరుగుతోంది. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో పలు దేశాల్లో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యం యూదులకు వ్యతిరేకంగా, పాలస్తీనా, హమాస్‌కి మద్దతుగా భారీ ర్యాలీలను నిర్వహిస్తున్నారు. ఇవి ఆయా దేశాల్లో హింసకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, యూకేల్లో ఇలాంటి ప్రో పాలస్తీనా నిరసనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.

Read Also: Shami: షమీ 7 వికెట్లు తీస్తాడని కలలో ముందే ఊహించా.. వైరల్ అవుతున్న ట్వీట్

ఇదిలా ఉంటే ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా గ్రూపుతో అనుమానిత సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో జర్మనీ వ్యాప్తంగా గురువారం భారీ సోదాలు జరిగాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు రైడ్స్ చేశారు. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో యూదు వ్యతిరేకతను అరికట్టేందుకు జర్మనీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇజ్రాయిల్‌పై హమాస్ ఉగ్రవాదులు అక్టోబర్ 7న జరిపిన దాడి తర్వాత జర్మనీలో హమాస్ కార్యకలాపాలతో పాటు సంబంధిత సంస్థలపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. దీని తర్వాత 54 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని అధికారులు దాడులు జరిపారు. ఇస్లామిక్ ర్యాడికలైజేషన్ మా దృష్టిలో ఉందని జర్మనీ అంతర్గత మంత్రి నాన్సీ ఫేజర్ అన్నారు. అనేక మంది యూదులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు చేస్తూ, ఇస్లామిక్ ప్రచారాన్ని సహించేది లేదని ఆమె అన్నారు.

గురువారం ఆపరేషన్‌లో భాగంగా హాంబర్గ్ ఇస్లామిక్ సెంటర్‌తో పాటు 5 అనుబంధ సమూహాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. హాంబర్గ్, లోయర్ సాక్సోనీ, హెస్సే, బెర్లిన్-వుర్టెంబెర్గ్, నార్త్ రైన్-వెస్ట్ ఫాలియాతో సహా జర్మనీలోని 16 రాష్ట్రాల్లోని ఆరింటిలో పోలీసులు సోదాలు నిర్వహించారు. హాంబర్గ్ ఇస్లామిక్ సెంటర్ ఇప్పటికే ఆ దేశ ఇంటెలిజెన్స్ నిఘాలో ఉంది. ఈ కేంద్రంతో పాటు దాని అనుబంధ సంస్థలు ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నాయనే అనుమానాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ దాడుల్లో ఎలాంటి అరెస్టులు జరగలేదు.

Show comments