Site icon NTV Telugu

Rahul Gandhi: BMW ప్లాంట్‌ను సందర్శించిన రాహుల్ గాంధీ.. వీడియో షేర్

Rahulgandhi

Rahulgandhi

కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జర్మనీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మ్యూనిచ్‌లోని బీఎండబ్ల్యూ ప్లాంట్‌ను రాహుల్ గాంధీ సందర్శించారు. BMW వెల్ట్, BMW ప్లాంట్‌ను  సందర్శించారు. కార్లు తయారీ, బైకుల తయారీని పరిశీలించారు. అనంతరం సిబ్బందితో కలియ తిరిగి వివరాలు తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. BMW భాగస్వామ్యంతో తయారైన TVS 450cc మోటార్‌సైకిల్‌ను చూసి సంతోషించారు. బైక్‌పైకి ఎక్కి ముచ్చట తీర్చుకున్నారు.

ఇక దుబాయ్‌కు చెందిన ఒక కుటుంబంతో సహా భారతీయులతో రాహుల్ గాంధీ ముచ్చటించారు. సందర్శకులతో ఫొటోలు కూడా దిగారు. ఇక ఒక కారును పరిశీలించి నడిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘భారతదేశం ఉత్పత్తిని ప్రారంభించాలి. ఏ దేశ విజయానికైనా ఉత్పత్తి కీలకం. మన తయారీ క్షీణిస్తోంది. వాస్తవానికి ఇది పెరగాలి.’’ అని డిమాండ్ చేశారు.

5 రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ గాంధీ జర్మనీకి వెళ్లారు. బెర్లిన్ విమానాశ్రయంలో దిగగానే ఘన స్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. నాయకులను కలిసి ముచ్చటించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు రాహుల్ గాంధీ ఈ యాత్ర చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఎన్నారై సమస్యలు, పార్టీ సిద్ధాంతాన్ని మరింత వ్యాప్తి చేయడానికి చర్చలు జరపనున్నారు.

 

Exit mobile version