NTV Telugu Site icon

Ukrainian crisis: మోడీ సూచనకు థ్యాంక్స్ చెప్పిన రష్యా అధ్యక్షుడు పుతిన్

Ni

Ni

గత రెండేళ్లుగా ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం సాగిస్తోంది. ఇప్పటికీ ఇరు దేశాల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. ఇక రెండ్రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ రష్యాలో పర్యటిస్తున్నారు. మంగళవారం ఉక్రెయిన్‌తో యుద్ధం గురించి పుతిన్‌తో మోడీ చర్చించి కీలకమైన సూచన చేశారు. దీంతో పుతిన్.. మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్‌లో వివాదాన్ని ముగించడానికి ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి కృషి చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు. మాస్కోలోని గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్‌లో జరిగిన ఇరు దేశాల ద్వైపాక్షిక సమావేశంలో శాంతిని నెలకొల్పడానికి రష్యాకు ఏ విధంగానైనా సహాయం చేయడానికి ఢిల్లీ సిద్ధంగా ఉందని మోడీ పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్‌ విషయంలో ఇరువురు నేతలు బహిరంగంగా అభిప్రాయాలు పంచుకోవడం సంతోషంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు.

ఇది కూడా చదవండి: Kandi Pappu: తక్కువ ధరకే కందిపప్పు.. క్యూకట్టిన ప్రజలు

రెండు దేశాల మధ్య సుదీర్ఘ స్నేహం, సత్సంబంధాలను ప్రస్తావిస్తూ ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంక్షోభానికి ముగింపు పలకడానికి ప్రధాని మోడీ చొరవను పుతిన్ అంగీకరించారు. ఈ సందర్భంగా మోడీకి థ్యాంక్స్ చెప్పారు. అలాగే ఇటీవల భారత్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ వరుసగా మూడో సారి విజయం సాధించినందుకు ప్రధాని మోడీకి పుతిన్ అభినందనలు తెలిపారు. మోడీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధిలో కొత్త విజయాలు సాధించాలని పుతిన్ ఆకాంక్షించారు.

ఇది కూడా చదవండి: Konda Surekha: బల్కంపేట తోపులాట ఘటన వెనుక కుట్ర కోణం.. మంత్రి కీలక వ్యాఖ్యలు