Site icon NTV Telugu

Putin: ‘‘షరతులు లేకుండా చర్చలకు సిద్ధం’’.. ఉక్రెయిన్‌కి పుతిన్ సందేశం..

Putin

Putin

Putin: రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ‘‘ముందస్తు షరతులు లేకుండా’’ ఉక్రెయిన్‌తో చర్చలు తిరిగి ప్రారంభించడానికి రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ చెప్పారు. అమెరికా రాయబారి స్టీవ్ విట్‌కాఫ్‌తో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ విషయాన్ని చెప్పినట్లు శుక్రవారం క్రెమ్లిన్ తెలిపింది. ‘‘ట్రంప్ రాయబారి విట్కాఫ్‌తో చర్చల సందర్భంగా వ్లాదిమిర్ పుతిన్ ఎటువంటి ముందస్తు షరతులు లేకుండా ఉక్రెయిన్ తో చర్చలను తిరిగి ప్రారంభించడానికి రష్యా సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు’’ అని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ అన్నారు. పుతిన్ కూడా ఇదే విషయాన్ని చాలా సార్లు చెప్పారని ఆయన అన్నారు.

Read Also: India Pakistan: జీలం నదికి వరదలు.. భారత్ నీటిని వదిలేసిందని పాక్ ఆరోపణ..

పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల సందర్భంగా రోమ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చల జరుగుతున్న సమయంలోనే, పుతిన్ నుంచి ఈ సందేశం వచ్చింది. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమైంది. రష్యా దళాలు ఉక్రెయిన్‌లోని ఐదో వంతు భూమిని ఆక్రమించాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 10,000 మంది మరణించారు.

Exit mobile version