NTV Telugu Site icon

Zelensky: పుతిన్ భయపడి ఎక్కడో దాక్కున్నాడు.. తిరుగుబాటుపై కీలక వ్యాఖ్యలు..

Zelenskyy, Putin

Zelenskyy, Putin

Zelensky: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పెద్ద తిరుగుబాటును ఎదుర్కొంటున్నాడు. తాను పెంచి పోషించిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ సాయుధ తిరుగుబాటుకు పిలుపునివ్వడంతో ఒక్కసారిగా ఈ విషయం ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ ఏకంగా పుతిన్ ను గద్దె దింపుతామని సవాల్ చేశాడు. రష్యాకు త్వరలో కొత్త అధ్యక్షుడు కూడా రాబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించిన పుతిన్ ఇది రష్యాకు వెన్నుపోటని, దేశద్రోహం అని దీనికి పాల్పడిన వారిని కఠినంగా అణిచివేస్తామన్నారు.

ఇదిలా ఉంటే ఈ పరిణామాలపై ఉక్రెయిన్ దేశం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇన్నాళ్లు ఉక్రెయిన్ లో బాంబులు పేలాయి, ఇపై రష్యాలో బాంబులు పేలుతాయంటూ వ్యాఖ్యానించింది. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే అంటూ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్కోలో తిరుగుబాటు రావడంతో పుతిన్ భయపడి ఎక్కడో దాక్కున్నాడని జెలన్ స్కీ అన్నారు. పుతిన్ ఈ ముప్పును స్వయంగా సృష్టించాడని అన్నారు.

Read Also: Red ant chutney: భారతదేశంలో రెడ్ యాంట్ చట్నీ.. ఆ రాష్ట్రాల ప్రజలు బాగా తింటారట..!

ఇదిలా ఉంటే ఉక్రెయిన్ బాఖ్ ముత్ పట్టణాన్ని కైవసం చేసుకునేందుకు రష్యాకు వాగ్నర్ గ్రూప్ సహాయపడింది. ఈ సమయంలో వాగ్నర్ గ్రూప్ పెద్ద సంఖ్యలో తన సభ్యులను కోల్పోయింది. రష్యా మిలిటరీ నుంచి సహాయం లభించకపోవడంతోనే తన సైన్యాన్ని కోల్పోవాల్సి వచ్చిందని వాగ్నర్ గ్రూప్ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. దీంతోనే రష్యన్ ఆర్మీ, వాగ్నర్ గ్రూపుకు మధ్య చెడింది. దీంతో ప్రిగోజిన్ తిరుగబాటు జెండాను ఎగరేశాడు.

శనివారం కీలక నగరమైన రోస్తోవ్ అన్ డాన్ లోని రష్యా సైనిక కార్యాలయాన్ని వాగ్నర్ గ్రూస్ స్వాధీనం చేసుకుంది. మాస్కోలని సైనిక నాయకత్వాన్ని కూల్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ, తమ వద్ద 25000 మంది బలగం ఉన్నట్లు వీరంతా రష్యా కోసం, రష్యా ప్రజల కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రిగోజిన్ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. తరువాత మాస్కో వైపు తమ దళాలను నడిపిస్తానని హెచ్చరించారు.