ఉక్రెయిన్‌లో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. రష్యా అనుకూల వేర్పాటువాదులు ప్రాబల్యం అధికంగా ఉన్న రెండు ప్రాంతాలను రష్యా స్వతంత్ర దేశాలుగా ప్రకటించింది. అందేకాదు, ఆ రెండు దేశాల్లో శాంతి పరిరక్షణ కోసం రష్యా తన సైన్యాన్ని పంపేందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. రష్యా సైనిక డిక్లరేషన్‌పై పుతిన్ సంతకం చేశారు. అటు రష్యన్ పార్లమెంట్ సైతం దీనిని ఆమోదించడంతో సైనిక బలగాలు ఉక్రెయిన్ గడ్డపై అడుగుపెట్టబోతున్నాయి. దీంతో ప్రపంచదేశాలు అప్రమత్తం అయ్యాయి. ఉక్రెయిన్‌లోని రెండు ప్రాంతాల్లోకి ప్రవేశించిన సైన్యం ఎలాంటి దాడులకు తెగబడుతుందో అని ఉక్రెయిన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Read: IAS Officers Transfers : బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
రష్యాపై ఇప్పటికే యూరోపియన్ సమాఖ్య ఆంక్షలు విధించింది. బ్రిటన్, అమెరికాలు సైతం ఆంక్షలు విధించాయి. చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని భారత్ చెబుతున్నది. నాటో దేశాలు పెద్ద ఎత్తున ఆయుధాలను ఉక్రెయిన్‌కు తరలిస్తుండటంతో రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అని ఆందోళనలు చెందుతున్నారు.