Site icon NTV Telugu

China: చైనా సైనిక కవాతులో పాల్గొన్న పుతిన్, జిన్‌పింగ్, కిమ్

Putin

Putin

చైనాలోని బీజింగ్‌లో భారీ సైనిక కవాతు జరిగింది. ఈ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా 25 దేశాధినేతలంతా హాజరయ్యారు. చైనా సైనికులు నిర్వహించిన భారీ కవాతును నేతలంతా తిలకించారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయానికి 80 ఏళ్ల పూర్తయిన సందర్భంగా చైనా భారీ కవాతు నిర్వహించింది. తొలిసారి అధునాతన యుద్ధ విమానాలు, క్షిపణులను ప్రదర్శించింది. ప్రపంచానికి ఒక సందేశం పంపించేందుకు చైనా ఈ ప్రదర్శన చేపట్టింది.

ఇది కూడా చదవండి: US-Venezuela: కరేబియన్ సముద్రంలో వెనిజులా నౌకపై అమెరికా దాడి.. 11 మంది మృతి

ఇక ఈ కవాతుకు ఉత్తర కొరియా నేత కిమ్ బుల్లెట్ ప్రూఫ్ రైల్లో ప్రయాణించి బీజింగ్ చేరుకున్నారు. కొంత మంది అధికారులతో కలిసి ప్రయాణం సాగించారు. 2023 తర్వాత దేశం విడిచి రావడం ఇదే తొలిసారి. అమెరికా, దాని మిత్ర దేశాల నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్న కారణాన ఉత్తర కొరియా.. చైనా, రష్యా మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే రష్యాకు కిమ్ సైనికులను కూడా పంపించారు.

ఇది కూడా చదవండి: Trump: భారత్‌ టారిఫ్‌లపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. వైట్‌హౌస్‌లో మీడియా ప్రశ్నకు సమాధానమిదే!

ఇక మంగళవారం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భేటీ అయ్యారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా పాల్గొన్నారు. షీల్డ్ మార్షల్‌గా బాధ్యతలు చేపట్టాక జిన్‌పింగ్‌‌ను కలవడం ఇదే తొలిసారి.

Exit mobile version