Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Putin Imposes Sanctions On Russian Media

Ukraine Russia War: మీడియాపై పుతిన్‌ ఆంక్షలు..

Published Date :March 23, 2022 , 12:07 pm
By Sudhakar Ravula
Ukraine Russia War: మీడియాపై పుతిన్‌ ఆంక్షలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరణాల లెక్కలు ఊహకు అందడం లేదు. అంతేలేకుండా సాగుతున్న ఈ సమరంలో, ఇప్పటి వరకు దాదాపు 10వేలమంది రష్యన్ సైనికులు చనిపోయారని తాజాగా వెల్లడించింది రష్యన్ ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థ కొమ్సో. అయితే ఏమైందో ఏమోగాని వెంటనే ఆ కథనాన్ని తొలగించింది. అయితే, అప్పటికే ఆ వివరాలు ప్రపంచమంతా పాకిపోయాయి. రష్యా రక్షణ శాఖ గణాంకాలను కోట్ చేస్తూ, కొమ్సో మీడియా చెప్పిన దాని ప్రకారం, 9,861 మంది రష్యన్ సైనికులు చనిపోయారు. 16,153 మంది గాయపడ్డారు. రష్యా బలగాల మరణాలపై ఏ దేశానికా దేశం భిన్నమైన సంఖ్యలు చెబుతున్నాయి. మూడు వారాలకు పైగా సాగుతున్న ఈ భీకర యుద్ధంలో, రష్యా 15వేల మందికి పైగా సైనికుల్ని కోల్పోయిందని ఉక్రెయిన్‌ వెల్లడించింది. అదే అమెరికా లెక్కల ప్రకారమైతే మరణించిన రష్యా సైనికుల సంఖ్య 7 వేలు. అయితే, రష్యా మాత్రం, మార్చి 2 నాటికి 498 మంది సైనికులు మాత్రమే మరణించారని చెబుతోంది. ఆ తర్వాత నుంచి అధికారిక లెక్కలు బయటకు రాలేదు.

Read Also: YS Jagan: దిశ పెట్రోలింగ్‌ వెహికల్స్‌ ప్రారంభం.. ఫోన్‌ 5 సార్లు ఊపితే చాలు..!

అయితే మొదట దాదాపు పది వేల మంది రష్యా సోల్జర్స్ చనిపోయారని చెప్పిన వార్తా సంస్థ, ఆ కథనాన్ని తొలగించి, కొత్తగా కథనాన్ని ప్రచురించింది. ఇందులోఈ మరణాల వివరాలేవీ లేవు. రష్యా సాధిస్తోన్న పురోగతి గురించి మాత్రమే ప్రస్తావన ఉంది. రష్యాలో మీడియా సంస్థలను కంట్రోల్ చేస్తోంది పుతిన్ ప్రభుత్వం. తప్పుడు వార్తలు రాస్తే ఏకంగా జైలు పాలు చేసేందుకు ఆఘమేఘాల మీద చట్టం కూడా తెచ్చింది. రష్యన్ ప్రభుత్వమే కావాలనే మరణాలను దాస్తోందని పాశ్చాత్య మీడియా అంటోంది. దాదాపు 10వేలమంది రష్యన్ సైనికులు చనిపోయారని రష్యా అనుకూల వార్తా సంస్థ వెల్లడి. అయితే, పదివేల మంది రష్యన్ సైనికుల చనిపోయారన్నదే వాస్తవమైతే, అది పుతిన్ సేనకు కోలుకోలేని దెబ్బే. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ కలిపి 20 ఏళ్లలో అమెరికా కోల్పోయిన సైనికుల కంటే ఈ సంఖ్య ఎక్కువ. 1979లో ఆఫ్ఘనిస్తాన్ పై దురాక్రమణలో 15 వేలమంది సోవియట్ యూనియన్ సైనికులు చనిపోయారు. పదేళ్ల వ్యవధిలో సాగిన యుద్ధమది. అయితే, ఇప్పుడు ఉక్రెయిన్ యుద్దంలో కేవలం నెలరోజుల వ్యవధిలోనే పదివేలమంది సైనికులను రష్యా కోల్పోయింది. చిన్నదేశం ప్రతిఘటనలో ఈస్థాయిలో బలగాలను కోల్పోవడం రష్యా ప్రతిష్టకే అవమానం. అందుకే మీడియా కథనాన్ని వెంటనే తొలగించేలా, పుతిన్ సర్కారు ఒత్తడి చేసిందని నిపుణులు అంటున్నారు. యుద్ధం ముగిసేనాటికి, ఈ సంఖ్య ఇంకెంత పెరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Putin
  • Russia
  • Russian media
  • Ukraine
  • Ukraine Russia War

తాజావార్తలు

  • MK Stalin: మదురైని మణిపూర్‌లా మార్చాలనుకున్నారు.. బీజేపీపై స్టాలిన్ విమర్శలు..

  • RCB-BCCI: ఆర్‌సీబీకి బీసీసీఐ మద్దతు.. అందుకేనా ఈ వరుస విజయాలు?

  • New Railway Line: తెలంగాణ, ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైల్వే ప్రాజెక్ట్‌పై అప్‌డేట్..

  • Avesh Khan అత్యుత్సాహం.. ఒక మ్యాచ్ నిషేధం తప్పదా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే.?

  • Riniki Bhuyan Sarma: అస్సాం ముఖ్యమంత్రి భార్య ఎవరో తెలుసా?

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions