Gambia: ఆఫ్రికాలో 66 మంది చిన్నారుల మృతి.. భారత ఔషధాలపై దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Probing 4 Indian Cough Syrups After 66 Children Die In Gambia: దగ్గు, జలుబు మందు వాడటం వల్ల ఆఫ్రికా దేశం గాంబియాలో 66 మంది పిల్లలు మరణించారు. భారతదేశానికి చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్ తయారు చేసిన నాలుగు దగ్గు మందులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మరణాలకు సదురు మందులే కారణం అని డబ్యూహెచ్ఓ హెచ్చరించింది. కలుషితమైన మందులు పశ్చిమ ఆఫ్రికా దేశాలకు సరఫరా చేసి ఉండవచ్చని భావిస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టడ్రోస్ అధనామ్ ఘేబ్రియెసస్ మాట్లాడుతూ.. నాలుగు జలుబు, దగ్గు సిరప్ లు తీవ్రమైన కిడ్నీ వ్యాధులు, పిల్లల మరణాలతో ముడిపడి ఉన్నాయని అన్నారు. డబ్యూహెచ్ఓ భారతీయ కంపెనీ, నియంత్రణ అధికారులతో తదుపరి విచారణ నిర్వహిస్తోందని ఆయన అన్నారు. ప్రొమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్‌మలిన్ బేబీ కఫ్ సిరప్, మాకోఫ్ బేబీ కఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ మందులపై డబ్ల్యూహెచ్ఓ అలెర్ట్ ప్రకటించింది.
Also Read
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
- Japan Earthquake: జపాన్‌లో 6.1 తీవ్రతతో భూకంపం.. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 11 ప్రధాన ప్రకంపనలు
- US Airstrike on Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం.. 24 గంటల్లో రెండోసారి ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడి
- PM Modi: సీషెల్స్‌లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
Read Also: Eknath Shinde: నేను “కట్టప్ప”నే కావచ్చు.. కానీ మీలాగ మాత్రం కాదు.. ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు
ఈ నాలుగు ఉత్పత్తుల భద్రత, నాణ్యతపై ఈ రోజ వరకు తయారీ సంస్థ డబ్ల్యూహెచ్ఓకు హామీ ఇవ్వలేదని.. పరిశోధనల్లో ఈ మందులు ఆమోదయోగ్యంకానీ డైథైలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్‌ను కలిగి ఉన్నాయని పేర్కొంది. ఈ పదార్థాల వల్ల మానవుడిలో తీవ్ర అనారోగ్య సమస్యలు సంభవించవచ్చని.. ప్రాణాంతంక కావచ్చని తెలిపింది. కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, తలనొప్పి, మానసిక స్థితిపై ప్రభావం చూపించి మూత్రపిండాల వైఫల్యానికి కారణం కావచ్చని తెలిపింది.
గతంలో 28 మంది పిల్లలు కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల మరణించిన తర్వాత గాంబియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పారసెటమాల్ వాడటాన్ని మానేయాలని ఆదేశించింది. భారత సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి అందిన సమాచారం ప్రకారం తయారీదారు కలుషితమైన మందులను గాంబియాకు మాత్రమే సరఫరా చేసినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అనధికార మార్గాల ద్వారా ఈ ఉత్పత్తులు ఆఫ్రికా, ఇతర దేశాలకు సరఫరా చేయడాన్ని తోసిపుచ్చలేమని తెలిపింది. ఈ మందులను రోగులకు హాని కలిగించకుండా చెలామణి ుంచి తొలగించడానికి అన్ని దేశాలు కృషి చేయాలని టెడ్రోస్ పిలుపునిచ్చారు.
"WHO has today issued a medical product alert for four contaminated medicines identified in #Gambia that have been potentially linked with acute kidney injuries and 66 deaths among children. The loss of these young lives is beyond heartbreaking for their families"-@DrTedros
— World Health Organization (WHO) (@WHO) October 5, 2022
తాజావార్తలు
-
Phone, Laptop: వాడిన ఫోన్ లేదా ల్యాప్‌టాప్ కొనాలని ఆలోచిస్తున్నారా? ఈ విషయాలు మర్చిపోకండి..!
-
Anushka Shetty : అనుష్క ఇక సినిమాలు చేయడం.. బయట కనిపించడం కష్టమే..
-
Donald Trump: “ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు”.. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
-
Joseph Vijay : ‘మెగా 158’ నిర్మాతకు క్యాబినెట్ హోదా.. సీఎం విజయ్ నిర్ణయం వెనుక అసలు కారణమేంటి?
-
Abhishek Sharma Fifty: షాకింగ్.. అభిషేక్ శర్మ అర్ధ శతకం రద్దు.. కారణం ఏంటో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!