Phone, Laptop: వాడిన ఫోన్ లేదా ల్యాప్‌టాప్ కొనాలని ఆలోచిస్తున్నారా? ఈ విషయాలు మర్చిపోకండి..!
- సెకండ్ హ్యాండ్ గాడ్జెట్ల వైపు మొగ్గు
- తక్కువ ధరకు వస్తోందని తొందరపడి కొనుగోలు చేస్తే తర్వాత ఇబ్బందులు
- స్క్రీన్, పోర్టులు, సెన్సార్లు తప్పనిసరిగా పరీక్షించండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది రిఫర్బిష్డ్ (Refurbished) లేదా సెకండ్ హ్యాండ్ గాడ్జెట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. సరైన హ్యాండ్ సెట్ ని ఎంపిక చేసుకుంటే కొత్త డివైస్‌తో పోలిస్తే 20 నుంచి 50 శాతం వరకు డబ్బు ఆదా చేయవచ్చు. అయితే, తక్కువ ధరకు వస్తోందని తొందరపడి కొనుగోలు చేస్తే తర్వాత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పనిసరిగా పరిశీలించాలి.
స్క్రీన్, పోర్టులు, సెన్సార్లు తప్పనిసరిగా పరీక్షించండి
సెకండ్ హ్యాండ్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ కొనుగోలు చేసే ముందు దాని బాహ్య రూపాన్ని మాత్రమే చూసి నిర్ణయం తీసుకోవద్దు.
Also Read
- Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
స్క్రీన్‌పై గీతలు లేదా డెడ్ పిక్సెల్స్ ఉన్నాయా లేదా చూడండి.
ఛార్జింగ్ పోర్ట్ సరిగా పనిచేస్తుందో లేదో పరీక్షించండి.
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, కెమెరా, స్పీకర్, మైక్రోఫోన్, బటన్లు సక్రమంగా పనిచేస్తున్నాయో చూసుకోవాలి.
ల్యాప్‌టాప్ అయితే కనీసం 10-15 నిమిషాలు ఉపయోగించి పనితీరును పరిశీలించండి.
బ్యాటరీ హెల్త్‌ను నిర్లక్ష్యం చేయొద్దు
సెకండ్ హ్యాండ్ డివైస్‌లో ఎక్కువగా దెబ్బతినే భాగం బ్యాటరీ. అందుకే కొనుగోలు చేసే ముందు బ్యాటరీ హెల్త్, ఛార్జింగ్ సైకిల్స్, బ్యాటరీ బ్యాకప్‌ను తప్పనిసరిగా చెక్ చేయాలి. అవసరమైతే డివైస్ సెట్టింగ్స్ లేదా డయాగ్నస్టిక్ యాప్‌ల ద్వారా బ్యాటరీ స్థితిని తెలుసుకోవచ్చు.
నమ్మకమైన ప్లాట్‌ఫామ్‌ల నుంచే కొనండి
సెకండ్ హ్యాండ్ గాడ్జెట్లు కొనుగోలు చేసేటప్పుడు విశ్వసనీయమైన ప్లాట్‌ఫామ్‌లను ఎంచుకోవడం మంచిది.
Cashify – భారతదేశంలో ప్రముఖ రీ-కామర్స్ ప్లాట్‌ఫామ్. 200కు పైగా ఆఫ్‌లైన్ స్టోర్లతో సేవలు అందిస్తోంది.
Amazon Renewed – నిపుణులచే పరీక్షించి, నాణ్యతా ప్రమాణాలు పూర్తి చేసిన రిఫర్బిష్డ్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉంటాయి.
Flipkart Refurbished – సర్టిఫైడ్ రిఫర్బిష్డ్ స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై 3 నుంచి 12 నెలల వరకు వారంటీ అందిస్తుంది.
కొనుగోలు ముందు ఈ విషయాలు కూడా గుర్తుంచుకోండి
IMEI నంబర్‌ను ధృవీకరించండి.
బిల్, వారంటీ లేదా కొనుగోలు రసీదు ఉంటే పరిశీలించండి.
డివైస్‌లో ఎలాంటి అకౌంట్ లాక్ (iCloud/Google Lock) లేదని నిర్ధారించుకోండి.
సాధ్యమైనంత వరకు వారంటీ లేదా రిటర్న్ పాలసీ ఉన్న పరికరాలనే కొనుగోలు చేయండి.
తక్కువ ధరకు మంచి డివైస్ కొనడం తెలివైన నిర్ణయమే. అయితే కొనుగోలు ముందు అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తేనే మీ డబ్బుకు పూర్తి విలువ లభిస్తుంది.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!