Site icon NTV Telugu

Earthquake: ఇండోనేసియాలో భారీ భూకంపం.. భయంతో ప్రజలు బెంబేలు

Earthquakebihar

Earthquakebihar

ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. సోమవారం తనింబర్ దీవుల ప్రాంతంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూమి ఉపరితలం క్రింద 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లుగా జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) తెలిపింది. భయంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణ నష్టంపై అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

ఇది కూడా చదవండి: Naveen Chandra : హనీతో నవీన్ చంద్ర కొత్త ప్రయాణం ప్రారంభం ..!

తువాల్‌ నగరానికి 177 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. సునామీ వచ్చే అవకాశాలు లేవని ప్రభుత్వ వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం మధ్యాహ్నం 12:49 గంటల సమయంలో భూకంపం సంభవించినట్లు సమాచారం. జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగి, సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Live-in Relationship: భార్యతో గొడవ పడుతుందని.. సహజీవనం చేస్తున్న మహిళపై ప్రియుడి దారుణం

ఇండోనేషియాలో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. 2021లో ఇండోనేసియాలో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపంతో 100 మందికి పైగా చనిపోయారు. ఇక 2018లో పాలూ ప్రాంతంలో 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపంతో సునామీ కారణంగా 2,200 మందికి పైగా మృతి చెందారు. ఇక 2004లో 9.1 తీవ్రతతో అత్యంత భీకరమైన భూకంపం సంభవించింది. హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీతో ఇండోనేషియాలోనే దాదాపు 2.3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రభావం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌పై కూడా ప్రభావం చూపించింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.

Exit mobile version