Most Canadians Believe China is a Threat: డ్రాగన్ కంట్రీ చైనాను ప్రపంచదేశాలు ముప్పుగా భావిస్తున్నాయి. కరోనా వైరస్ , చైనా దుందుడుకు వైఖరి, ఇతర దేశాలపై నిఘా, ఇతర దేశాల ఎన్నికలను ప్రభావితం చేస్తోంది చైనా. దీంతో చైనాతో ఎప్పటికైనా ప్రమాదం ఉంటుందని పలు దేశాలు భావిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో కెనడా కూడా చేరింది. ఇటీవల నిర్వహించిన ఓ పోల్ లో కెనడా ప్రజలు చైనాతో ముప్పు ఉందని భావిస్తున్నారు. ఇదే సమయంలో భారత్ తో సన్నిహిత సంబంధాలను కోరుకోవడం గమనార్హం. శుక్రవారం విడుదల చేసిన కొత్త సర్వే ప్రకారం.. మెజారిటీ కెనడియన్లు భారత్ పై సానుకూల దృక్పథంతో ఉన్నారు.
Read Also: Swati Maliwal : మా నాన్న నన్ను లైంగికంగా వేధించాడు.. మహిళ కమిషన్ చీఫ్ సంచలనం
పబ్లిక్ ఓపీనియన్ రీసెర్చ్ ఏజెన్సీ ఏఆర్ఐ ఫిబ్రవరి చివరల్లో ఈ పోల్ నిర్వహించింది. మొత్తం 1622 మంది ఈ పోల్ లో పాల్గొన్నారు. ఇందులో మెజారిటీ కెనడియన్లు చైనాను ముప్పుగా భావిస్తున్నారు. ఏకంగా ఇది 40 శాతం ఉంది. అత్యంత ప్రమాదకమైన శత్రువుగా భావించే వారు 22 శాతం ఉన్నారు. కేవలం 12 మంది చైనాకు అనుకూలంగా ఉన్నారు. ఇక ఉక్రెయిన్ పై దాడి చేసిన రష్యా, చైనా కన్నా ఎక్కువ ముప్పు ఉందని కెనడా ప్రజలు ఓటేశారు. ఏకంగా 72 శాతం మంది కెనడా ప్రయోజనాలకు రష్యా ముప్పు అని తెలిపారు. ఇక భారత్ విషయానికి వస్తే 42 శాతం మంది భారత్ స్నేహపూర్వక దేశమని, 10 శాతం మంది విలువైన భాగస్వామి, మిత్రదేశంగా పరిగణించాలని అభిప్రాయపడుతున్నారు. తైవాన్ పట్ట్ 62 శాతం కెనడియన్లు అనుకూల అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు.
ఇటీవల కెనడా గగనతలంలో చైనీస్ స్పై బెలూన్లు, గత రెండు కెనడా ఎన్నికల్లో చైనా జోక్యం వార్తలు వెలుగులోకి వచ్చాయి. కెనడాలో 2019, 2021 ఫెడరల్ ఎన్నికల్లో చైనా జోక్యం గురించి గ్లోబ్, మెయిల్, గ్లోబల్ న్యూస్ పలు కథనాలు ప్రచురించింది. ఇది ఆ దేశంలో పెను దుమారాన్ని రేపింది. అయితే ఈ ఆరోపణలపై విచారణ చేయాలా.? వద్దా.? అనేదానిపై పరిశీలకులను నియమిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వెల్లడించారు.