NTV Telugu Site icon

PM Sheikh Hasina: బంగ్లాదేశ్‌ని విభజించి క్రిస్టియన్ దేశం ఏర్పాటు చేయాలనే కుట్ర.. ఆ దేశం గురించేనా..?

Pm Sheikh Hasina

Pm Sheikh Hasina

PM Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సంచలన ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్‌ని విభజించి క్రిస్టియన్ దేశాన్ని ఏర్పాటు చేయడానికి కుట్ర పన్నుతున్నారని చెప్పారు. బంగ్లాదేశ్, మయన్మార్‌లోని కొన్ని భాగాలను విభజించి తూర్పు తైమూర్ తరహా క్రిస్టియన్ రాజ్యాన్ని సృష్టించడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో ఒక విదేశానికి చెందిన ఎయిర్ బేస్‌కి అనుమతిస్తే జనవరి నెలలో ఎన్నికలు జరిగి మళ్లీ తాను ఎన్నికయ్యే అవకాశం ఉందని చెప్పారు. అయితే, ఆ దేశం పేరును మాత్రం ప్రకటించలేదు.

‘‘తూర్పు తైమూర్ దేశంలా బంగ్లాదేశ్(ఛటోగ్రామ్)లోని కొన్ని ప్రాంతాలు, మయన్మార్‌లోని కొన్ని ప్రాంతాలను కలిపి బంగాళాఖాతంలో ఒక స్థావరం కోసం ఒక క్రైస్తవ దేశాన్ని రూపొందిస్తారు’’ అని గురువారం జరిగిన ఓ సమావేశంలో ఆమె అన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామీ లీగ్ అధ్యక్షురాలిగా ఉన్న షేక్ హసీనా ఎన్నికల తర్వాత కూటమిలోని 14 పార్టీలతో తొలిసారి సమావేశమయ్యారు.

Read Also: Rahul Gandhi: ‘‘అందుకే ప్రధాని మోడీని దేవుడు పంపాడు.’’ రాహుల్ గాంధీ సెటైర్లు..

ప్రాంతీయ సుస్థిరతకు భంగం కలిగించే ఎలాంటి ప్రయత్నాలను అడ్డుకుంటామని షేక్ హసీనా ప్రతిజ్ఞ చేశారు మరియు అలాంటి కుట్రలను ఎదుర్కోవడానికి తాను నిశ్చయించుకున్నానని చెప్పారు. షేక్ హసీనా ఎలాంటి వివరాలు వెల్లడించకుండా ‘‘తెల్లవారి నుంచి ఆఫర్ వచ్చింది’’ అని చెప్పారు. ఇది ఒక దేశాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపించవచ్చు, కానీ అది కాదని, వారు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో నాకు తెలుసు అని ఆమె అన్నారు. తాను బంగ్లాదేశ్‌లో ఆ దేశం ఎయిర్ బేస్‌కి అనుమతించినట్లైతే నాకు ఎలాంటి సమస్య ఉండేది కాదని చెప్పారు.

ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ(బీఎన్‌పీ) ఎన్నికల ప్రక్రియకు వ్యతిరేకంగా కుట్ర చేస్తోందని ఆమె ఆరోపించారు. అయితే, అమెరికాను లక్ష్యంగా చేసుకుని షేక్ హసీనా ఈ వ్యాఖ్యలు చేసినట్లు అనుకుంటున్నారు. బంగ్లాదేశ్‌కి దక్షిణాన ఉన్న సెయింట్ మార్టిన్ ద్వీపంపై అమెరికా కన్నేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే 2023లో S డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్, సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని నియంత్రించడం గురించి యునైటెడ్ స్టేట్స్ ఎప్పుడూ చర్చించలేదని చెప్పారు.