NTV Telugu Site icon

PM Modi Russia Tour: నేడు రష్యాకు ప్రధాని మోడీ.. కీలక అంశాలపై చర్చ..!

Modi

Modi

PM Modi Russia Tour: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. 22వ ఇండో– రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనబోతున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపే అవకాశం ఉంది. పలు రంగాల్లో విస్తృత స్థాయి సహకారంపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగాక మోడీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి. అయితే, మూడేళ్ల విరామం తర్వాత భారత్‌– రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు జరుగుతుండటంతో ఈ సమిట్‌లో చర్చించబోయే అంశాలు, తీసుకోబోయే ఉమ్మడి నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి కొనసాగుతుంది.

Read Also: PM Modi : నేటి నుంచి మూడు రోజుల పాటు మోడీ విదేశీ పర్యటన.. ఆస్ట్రియాతో కీలక చర్చలు జరిపే ఛాన్స్

అయితే, చివరిసారిగా 2021 డిసెంబర్‌లో ఢిల్లీలో ఇండో- రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఇవాళ (సోమవారం) మధ్యాహ్నం రష్యాకు ప్రధాని మోడీ చేరుకున్నాక.. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ఇచ్చే ప్రత్యేక విందు కార్యక్రమానికి హాజరవుతారు. ఆ తర్వాత శిఖరాగ్ర సదస్సు స్టార్ట్ అవుతుంది. మరుసటి రోజు రష్యాలోని భారతీయ సంతతి వ్యక్తులతో నరేంద్ర మోడీ మాట్లాడనున్నారు. అలాగే, క్లెమ్లిన్‌లో అనామక సైనికుల స్మారకం దగ్గర శ్రద్ధాంజలి ఘటిస్తారు. దీని తర్వాత మాస్కోలో ఎగ్జిబిషన్‌ను సందర్శించనున్నారు.. ఇక, రష్యా పర్యటన తర్వాత జులై 9న ఆస్ట్రియా పర్యటనకు ప్రధాని మోడీ వెళ్లనున్నారు. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్‌ వాన్‌ డీర్‌ బెల్లాన్, చాన్స్‌లర్‌ కార్ల్‌ నెహామెర్‌లతో విడివిడిగా మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ‘ఆస్ట్రియా, భారత్‌ మైత్రీబంధానికి 75 ఏళ్లు పూర్తైతున్న వేళ మోడీతో చర్చల కోసం రెడీగా ఉన్నామని నెహామెర్‌ శనివారం ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్‌కు మోడీ ఆదివారం రోజు రియాక్ట్ అయ్యారు.

Read Also: Nepal Floods : నేపాల్‌లో వరద బీభత్సం.. ఇప్పటివరకు 62 మంది మృతి

కాగా, ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత పటిష్టం చేసేందుకు.. చర్చల కోసం ఎదురుచూస్తున్నామని మోడీ అన్నారు. భారత ప్రధాని ఒకరు ఆస్ట్రియాలో పర్యటిస్తుండటం గత 40 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషంగా చెప్పుకొవచ్చు.. భారత్, ఆస్ట్రియాకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ జరగనుంది. మాస్కోతో పాటు వియన్నాలోని భారతీయ సంతతి ప్రజలతో ప్రధాని మాట్లాడనున్నారు.