PM Modi: బౌద్ధ గురువు దలైలామాకు ప్రధాని మోడీ బర్త్‌డే విషెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దలైలామా 87వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు దేవుడు దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా అని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని సుగ్లాగ్ఖాంగ్లో దలైలామా 87వ జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. బౌద్ధ సన్యాసులు, సన్యాసినులు, పాఠశాల విద్యార్థులు, విదేశీయులతో సహా వందలాది మంది టిబెటన్లు హాజరయ్యారు. సెంట్రల్ టిబెటన్ అడ్మిన్ నిర్వహించిన వేడుకల్లో హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ కూడా పాల్గొన్నాడు. దలైలామా పుట్టిన రోజు వేడుకల్లో ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ వర్చువల్‌గా పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Piyush Goyal: నేను బిజీగా వుంటా .. రాష్ట్ర మంత్రులపై కేంద్రమంత్రి ఫైర్
Also Read
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
- Iran and US Tensions: ఇరాన్‌పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
దలైలామా 1959లో చైనా నుంచి భారత్‌కు వచ్చిన తర్వాత ఇక్కడే ప్రవాస జీవితం గడుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత గౌరవనీయమైన ఆధ్యాత్మిక నాయకులలో ఆయన ఒకరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టిబెటన్లు 14వ దలైలామా 87వ జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. దలైలామా టిబెట్‌లో అతిపెద్ద మత గురువు. 1959లో అప్పటి చైనా ప్రభుత్వం టిబెట్‌ను ఆక్రమించుకుంది. చైనా దురాగతాల కారణంగా దలైలామా భారత్‌కు వచ్చారు. దలైలామా రహస్యంగా భారతదేశానికి చేరుకున్న తర్వాత.. చైనా అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. దలైలామా మీది కోపాన్ని చైనా భారత్‌పై చూపించింది. దీంతో 1962 సంవత్సరంలో భారత్‌పై దాడి చేసింది. టిబెట్‌ను చైనా ఆక్రమించిన తర్వాతే భారత్‌తో సరిహద్దు గొడవలు మొదలయ్యాయి. గతంలో చైనా, భారత్ సరిహద్దుల మధ్య ప్రత్యేక టిబెట్ దేశంగా ఉండేది. దలైలామాతో పాటు ఆయన ప్రభుత్వంలోని వ్యక్తులు కూడా అక్కడి నుంచి భారత్‌కు వచ్చేశారు. టిబెట్ స్వాతంత్ర్య ఉద్యమానికి దలైలామా అంతర్జాతీయంగా విస్తృత మద్దతును పొందారు.
తాజావార్తలు
-
SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్‌ల సమర్పణ.. 60 శాతం నమోదు..
-
AAA Vizag : వైజాగ్ AAA స్క్రీన్ స్పెసిఫికేషన్స్ వేరే లెవెల్ అంతే!
-
Darshan Case: రీల్ హీరో రియల్ విలన్.. దర్శన్ కేసులో దిమ్మతిరిగే నిజాలు! అప్రూవర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు..
-
Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
-
Vismaya Mohanlal : ఫస్ట్ సినిమాతో అదరగొట్టిన మోహన్ లాల్ కూతరు.. మూడు రోజుల్లో భారీ కలెక్షన్స్
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!