Site icon NTV Telugu

PM Modi: బౌద్ధ గురువు దలైలామాకు ప్రధాని మోడీ బర్త్‌డే విషెస్..

Pm Modi Wishes

Pm Modi Wishes

ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దలైలామా 87వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు దేవుడు దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా అని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని సుగ్లాగ్‌ఖాంగ్‌లో దలైలామా 87వ జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. బౌద్ధ సన్యాసులు, సన్యాసినులు, పాఠశాల విద్యార్థులు, విదేశీయులతో సహా వందలాది మంది టిబెటన్లు హాజరయ్యారు. సెంట్రల్ టిబెటన్ అడ్మిన్ నిర్వహించిన వేడుకల్లో హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ కూడా పాల్గొన్నాడు. దలైలామా పుట్టిన రోజు వేడుకల్లో ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ వర్చువల్‌గా పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Piyush Goyal: నేను బిజీగా వుంటా .. రాష్ట్ర మంత్రుల‌పై కేంద్రమంత్రి ఫైర్‌

దలైలామా 1959లో చైనా నుంచి భారత్‌కు వచ్చిన తర్వాత ఇక్కడే ప్రవాస జీవితం గడుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత గౌరవనీయమైన ఆధ్యాత్మిక నాయకులలో ఆయన ఒకరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టిబెటన్లు 14వ దలైలామా 87వ జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. దలైలామా టిబెట్‌లో అతిపెద్ద మత గురువు. 1959లో అప్పటి చైనా ప్రభుత్వం టిబెట్‌ను ఆక్రమించుకుంది. చైనా దురాగతాల కారణంగా దలైలామా భారత్‌కు వచ్చారు. దలైలామా రహస్యంగా భారతదేశానికి చేరుకున్న తర్వాత.. చైనా అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. దలైలామా మీది కోపాన్ని చైనా భారత్‌పై చూపించింది. దీంతో 1962 సంవత్సరంలో భారత్‌పై దాడి చేసింది. టిబెట్‌ను చైనా ఆక్రమించిన తర్వాతే భారత్‌తో సరిహద్దు గొడవలు మొదలయ్యాయి. గతంలో చైనా, భారత్ సరిహద్దుల మధ్య ప్రత్యేక టిబెట్ దేశంగా ఉండేది. దలైలామాతో పాటు ఆయన ప్రభుత్వంలోని వ్యక్తులు కూడా అక్కడి నుంచి భారత్‌కు వచ్చేశారు. టిబెట్ స్వాతంత్ర్య ఉద్యమానికి దలైలామా అంతర్జాతీయంగా విస్తృత మద్దతును పొందారు.

Exit mobile version