PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- నార్వే ప్రధానితో మోడీ భేటీ
- ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- రెండు దేశాల సంబంధంపై మోడీ సంతోషం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటనలో భాగంగా నార్వేలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా నార్వే ప్రధాని స్టోరేతో మోడీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అంతకముందు ఓస్లోలో ప్రధాని మోడీకి నార్వే ప్రధాని ఘన స్వాగతం పలికారు.
మోడీ మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు నార్వే ఇండో-పసిఫిక్ మహాసముద్రాల చొరవలో చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది. రెండు ప్రధాన సముద్ర దేశాలుగా.. సముద్ర ఆర్థిక వ్యవస్థ, సముద్ర భద్రత, సామర్థ్య నిర్మాణం వంటి రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి మేము కలిసి పనిచేస్తాం. ఈ రోజు మేము త్రికోణాకార అభివృద్ధి సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. ఏ సమస్యకైనా సైనిక ఘర్షణ పరిష్కారం చూపలేదనే విషయంలో మేమంతా ఏకతాటిపై ఉన్నాం. అది ఉక్రెయిన్‌కు సంబంధించినదైనా లేదా పశ్చిమాసియాకు సంబంధించినదైనా.. ఘర్షణలను త్వరితగతిన నిలిపివేసి, శాంతిని పునరుద్ధరించడమే లక్ష్యంగా సాగే ప్రతి ప్రయత్నానికి మేము మద్దతు ఇస్తాము..ఇస్తూనే ఉంటాము.’’ అని మోడీ తెలిపారు.
Also Read
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
‘‘ఈ రోజు మేము భారతదేశం-నార్వే మధ్య సంబంధానికి ‘హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం’ రూపాన్ని ఇస్తున్నాం. స్వచ్ఛ ఇంధనం నుంచి వాతావరణ స్థితిస్థాపకత వరకు.. నీలి ఆర్థిక వ్యవస్థ నుంచి హరిత నౌకా రవాణా వరకు ప్రతి రంగాన్ని విస్తరించిన ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం, భారతదేశ పరిమాణం, వేగం, ప్రతిభను నార్వే సాంకేతికత, మూలధనంతో కలపడం ద్వారా రూపుదిద్దుకుంటోంది. భారతదేశపు ఆర్కిటిక్ పరిశోధనా కేంద్రమైన ‘హిమాద్రి’ కార్యకలాపాలను సులభతరం చేసినందుకు మేము నార్వేకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇస్రో, నార్వేజియన్ అంతరిక్ష సంస్థ మధ్య ఈ రోజు సంతకం అవుతున్న అవగాహన ఒప్పందం. అంతరిక్ష రంగంలో మా సహకారానికి ఒక కొత్త కోణాన్ని జోడిస్తుంది..’’ అని పేర్కొన్నారు.
#WATCH | Oslo, Norway: Prime Minister Narendra Modi says, "We are delighted that Norway is joining the Indo-Pacific Oceans Initiative today. As two major maritime nations, we will work together to strengthen cooperation in the fields of marine economy, maritime security, and… pic.twitter.com/B2WfvatNgf
— ANI (@ANI) May 18, 2026
#WATCH | Oslo, Norway: Prime Minister Narendra Modi says, "… Today, we are giving the relationship between India and Norway the form of a 'Green Strategic Partnership.' This Strategic Partnership spanning every sector from clean energy to climate resilience, and from the Blue… pic.twitter.com/aKtCDzOKJD
— ANI (@ANI) May 18, 2026
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!