Modi – Meloni – Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్‌ గిఫ్ట్..! సోషల్‌ మీడియాను ఊపేస్తున్న వీడియో

Modi Meloni Melody

Modi Meloni Melody

Modi – Meloni – Melody: ఇటలీ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి ఓ ప్రత్యేకమైన బహుమతి ఇవ్వడం.. ఆ సందర్భాన్ని వీడియో తీసిన మెలోని సోషల్‌ మీడియాలో పెట్టడంతో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. మెలోనికి మోడీ ప్రత్యేకమైన ‘మెలోడీ’ టాఫీని బహుమతిగా అందించారు. ఈ ఆసక్తికరమైన గిఫ్ట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది.. ప్రధాని మోదీ ఇచ్చిన బహుమతిపై స్పందించిన జార్జియా మెలోని, తన సోషల్ మీడియా ఖాతాలో “బహుమతికి ధన్యవాదాలు” అంటూ పోస్ట్ చేశారు. దీంతో #Melodi హ్యాష్‌ట్యాగ్ మరోసారి నెట్టింట ట్రెండింగ్‌గా మారింది.

గత కొన్ని సంవత్సరాలుగా మోడీ-మెలోని స్నేహబంధం సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇద్దరు నేతలు కలిసిన ప్రతిసారి #Melodi అనే హ్యాష్‌ట్యాగ్ వైరల్ అవుతుండగా, ఈసారి మోడీ ‘మెలోడీ’ టాఫీల ప్యాకెట్‌ను బహుమతిగా ఇవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటలీ-భారత్ సంబంధాల్లో పెరుగుతున్న ఆత్మీయతకు ప్రతీకగా ఈ బహుమతిని విశ్లేషకులు చూస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా “Melodi” అనే పదాన్ని సరదాగా “Melody” చాక్లెట్‌తో ముడిపెట్టి నెటిజన్లు భారీగా పోస్టులు చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఇటలీలో ఉన్నారు. ఈ సందర్భంగా వాణిజ్యం, రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యం, సాంకేతిక సహకారం వంటి కీలక అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే మోడీ-మెలోని సెల్ఫీలు, వీడియోలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుండగా, తాజా ‘మెలోడీ టాఫీ’ బహుమతి ఘటన సోషల్ మీడియాలో కొత్త హాట్ టాపిక్‌గా మారింది.