Site icon NTV Telugu

PM Modi: ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు సరికాదు.. పాక్‌పై మోడీ ఫైర్

Modi55

Modi55

ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు సరికాదని.. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలపై ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. చైనాలోని టియాంజిన్‌ వేదికగా జరుగుతున్న ఎస్‌సీవో శిగ్రరాగ్ర సమావేశంలో మోడీ ప్రసంగించారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని మోడీ ప్రస్తావించారు. ఉగ్ర సంస్థలకు కొన్ని దేశాలు అందించే బహిరంగ మద్దతును సహిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఉగ్రవాదం ఏ దేశ భద్రతకు క్షేమం కాదని.. మొత్తం మానవాళికే ముప్పు అని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: PM Modi: పాక్ ప్రధాని షెహబాజ్‌కు మోడీ బిగ్ షాక్.. పట్టించుకోని ప్రధాని

భారతదేశం నాలుగు దశాబ్దాలుగా ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటోందని.. పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో తమకు అండగా నిలిచిన దేశాలకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని.. అందరూ స్పష్టంగా తమ అభిప్రాయాన్ని చెప్పాలన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి మానవత్వాన్ని విశ్వసించే ప్రతి దేశానికి బహిరంగ సవాల్ అన్నారు. ఇలాంటి సమయంలో కొన్ని దేశాలు ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు ఇవ్వడం ఆమోదయోగ్యమేనా? అని నిలదీశారు. ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనైనా.. ఏ రంగులోనైనా మనం ఏకగ్రీవంగా వ్యతిరేకించాలన్నారు. ఇది మానవత్వం పట్ల మనకున్న విధి అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: PM Modi: మోడీ-పుతిన్-జిన్‌పింగ్ సంభాషణ.. ఎక్స్‌లో ఫొటోలు పెట్టిన మోడీ

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదలుు 26 మందిని చంపేశారు. అనంతరం భారత ప్రభుత్వం పాకిస్థాన్‌పై కఠిన ఆంక్షలు విధించింది. సింధు జలాలు నిలిపివేసింది. అలాగే వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దు మూసేసింది. ఇక మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులను హతం చేయగా.. వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

టియాంజిన్‌లో జరిగే ఎస్‌సీవో శిఖరాగ్ర సమావేశానికి 11 దేశాల నేతలను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆహ్వానించారు. ఇక ఇందులో ప్రధానంగా రష్యా అధ్యక్షుడు పుతిన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఉన్నారు. ఈ సమ్మిట్‌కు ఎస్‌సీవో దేశాలతో పాటు నేపాల్, మాల్దీవులు, తుర్కియే, ఈజిప్ట్, ఇండోనేషియా, మలేషియా, వియత్నాం, కంబోడియా, మంగోలియా, తుర్క్‌మెనిస్తాన్, లావోస్, అర్మేనియా, అజర్‌బైజాన్ నాయకులంతా సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది.

Exit mobile version