France: 300 మందికి పైగా భారతీయులతో వెళ్తున్న విమానాన్ని ఫ్రాన్స్ అధికారులు ఆ దేశంలో నిలిపేసినట్లు శుక్రవారం తెలిపారు. ప్రయాణికులను తీసుకెళ్తున్న విమానం ‘మానవ అక్రమ రవాణా’ అనుమానంతో విమానాన్ని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. రహస్య సమాచారం రావడంతో ఈ విమానాన్ని అధికారులు అడ్డుకున్నారు. యూఏఈ నుంచి ఈ విమానం బయలుదేరింది. దక్షిణ అమెరికాలోని నికరాగ్వాకి వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read Also: Hijab: “ఇక మీకు నచ్చిన దుస్తులు ధరించవచ్చు”.. కర్ణాటకలో హిజాబ్‌పై బ్యాన్ ఎత్తివేత..
ఈ ఘటనపై నేషనల్ యాంటీ ఆర్గనైజ్డ్ క్రైమ్ యూనిట్ జునాల్కో విచారణ చేపట్టిందని ప్రాసిక్యూటర్లు తెలిపారు. రొమేనియన్ కంపెనీ లెజెండ్ ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తున్న A340, ల్యాండింగ్ తర్వాత వాట్రీ విమానాశ్రయంలో నిలిచిపోయింది. విమానం ఇంధనం నింపుకోవాల్సి వచ్చిందని, అందులో 303 మంది భారతీయులు ఉన్నారని తెలిపింది. అయితే భారతీయులు అమెరికా లేదా కెనడాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు సెంట్రల్ అమెరికాకు వెళ్లేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
