NTV Telugu Site icon

Sheikh Hasina: నిరసనకారుల అమానుషం.. షేక్ హసీనా దుస్తులు వేసుకుని ప్రదర్శన

Sheikhhasinapm

Sheikhhasinapm

షేక్ హసీనా.. సుదీర్ఘ కాలం పాటు బంగ్లాదేశ్‌ను పరిపాలించిన మహా నేత. ఎంతో ఘనకీర్తిని సంపాదించింది. కానీ ఒక్క రోజులోనే చరిత్ర తల్లకిందులైంది. ప్రధాని పదవికి గుడ్‌బై చెప్పి విదేశాలకు పారిపోయింది. నిరసనకారుల దెబ్బకు ఆమె తోక ముడిచి పరారైంది. ఇప్పుడు దేశ రాజధాని ఢాకా నిరసనకారుల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ప్రధానమంత్రి అధికారిక నివాసం కుక్కలు చింపిన విస్తరాకులా అయిపోయింది. ఇన్నాళ్లు షేక్ హసీనా ఉపయోగించిన వస్తువులను, దుస్తులను ఆందోళనకారులు లూటీ చేశారు. ఏది దొరికితే అది తీసుకుని వెళ్లిపోయారు. ఇంకొందరు మంచాలపై పడుకుని ఎంజాయ్ చేశారు.

ఇదిలా ఉంటే కొందరు నిరసనకారులు అమానుష చర్యకు పాల్పడ్డారు. సుదీర్ఘ కాలం దేశాన్ని పరిపాలించిన షేక్ హసీనా ఒక మహిళ అన్న గౌరవం లేకుండా ప్రవర్తించారు. ఆమె ధరించిన చీరలు.. లోదుస్తులను దొంగిలించి నిరసనకారులు వేసుకుని ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దుస్తులు, ఫర్నిచర్, పశువులు, ఎలక్ట్రానిక్స్ వస్తువులను ఎత్తుకెళ్లిపోయారు. ఒక చిత్రంలో ఒక వ్యక్తి చీర కట్టుకుని, ప్లాస్టిక్ బకెట్‌తో బట్టలతో నిండుగా తీసుకెళ్తుండగా… మరొక యువకుడు ఊదారంగు జాకెట్టును పట్టుకున్నట్లు చూపించాడు. షేక్ హసీనా వ్యక్తిగత వస్తువులను దోచుకోవడం మరియు బహిరంగంగా ప్రదర్శించడాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని మండిపడుతున్నారు.

సోమవారం కోటా ఉద్యమం తీవ్రం అవ్వడంతో షేక్ హసీనా.. ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చేశారు. అనంతరం ఆమె ఢిల్లీ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. కోటా ఉద్యమం కారణంగా బంగ్లాదేశ్‌లో 300 మంది నిరసనకారులు ప్రాణాలు వదిలారు.