Site icon NTV Telugu

Pak-Afghan: పాక్-ఆప్ఘన్ మధ్య చర్చలు మళ్లీ విఫలం.. యుద్ధం తప్పదా?

Pakistanafghanistan

Pakistanafghanistan

పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య చర్చలు మళ్లీ విఫలం అయ్యాయి. ఇస్తాంబుల్‌ వేదికగా రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరిగాయి. కానీ ఎలాంటి పురోగతి లేకుండా చర్చలు ముగిశాయి. రెండు దేశాల మధ్య శాంతి చర్చలు విఫలం అయ్యాయని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటించారు. ఇక చర్చల ప్రారంభానికి ముందు ఖవాజా మాట్లాడుతూ.. ఈసారి మాత్రం చర్చలు విఫలమైతే యుద్ధం తప్పదని హెచ్చరించారు. తాజాగా మరోసారి అదే విషయాన్ని ప్రస్తావిస్తూ సరిహద్దులో దాడులు కొనసాగితే పాకిస్థాన్ ప్రతిస్పందిస్తుందని వార్నింగ్ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Mali: మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్.. ఐసిస్ గ్రూప్‌పై అనుమానాలు

వ్రాతపూర్వక ఒప్పందంపై సంతకం చేయడానికి తాలిబన్ ప్రతినిధి బృందం నిరాకరించిందని.. మౌఖిక అవగాహన కోసం పట్టుబట్టడంతో అకస్మాత్తుగా చర్చలు ముగిశాయని ఖవాజా తెలిపారు. ఇస్తాంబుల్‌లో రెండు రోజుల పాటు చర్చలు జరుగుతాయని భావించాం కానీ.. అర్థాంతరంగా ముగిశాయని చెప్పారు.

ఇది కూడా చదవండి: Trump: అమెరికా నిరసన.. దక్షిణాఫ్రికా జీ 20 సదస్సుకు ట్రంప్ గైర్హాజరు

గత కొంతకాలంగా పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. సరిహద్దులో ఇరు పక్షాలు దాడులు చేసుకోవడంతో ప్రాణనష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వం వహించి ఇరు పక్షాలతో శాంతి చర్చలు జరిపేందుకు పూనుకున్నాయి. ఇటీవల దోహాలో చర్చలు జరిగాయి. ఈ చర్చలకు కూడా సఫలీకృతం కాలేదు. తాజాగా ఇస్తాంబుల్ వేదికగా జరిగిన చర్చలు కూడా అకస్మాత్తుగా ముగిశాయి. దీంతో పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి.

ఇది కూడా చదవండి: Off The Record: వైసీపీ కమ్మ రాగాన్ని కొత్త శృతిలో పాడబోతోందా..? ఇంతకీ ఏం చేయబోతుంది పార్టీ..?

Exit mobile version