Ismail Haniyeh: హమాస్ చీఫ్ హనియే హత్యపై తీవ్రంగా స్పందించిన ఇరాన్..
- హమాస్ చీఫ్ హత్యపై ఇరాన్ ఆగ్రహం..
- తప్పకుండా ప్రతీకారం ఉంటుందని హెచ్చరిక..
- ఇజ్రాయిల్ కారణం అంటూ రగిలిపోతున్న హమాస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ismail Haniyeh: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియేని గుర్తుతెలియని వ్యక్తులు ఇరాన్ టెహ్రాన్ నగరంలో కాల్చి చంపారు. ఈ హత్యపై ఇరాన్ తీవ్రంగా స్పందిస్తోంది. తన ప్రాధేశిక సమగ్రతను, గౌరవాన్ని కాపాడుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అన్నారు. ఇరాన్, పాలెస్తీనా బంధం గతంలో కన్నా చాలా బలంగా ఉందని ఆయన అన్నారు. ఇరాన్ అధ్యక్షుడి ప్రమాణస్వీకార కార్యక్రమానికి వచ్చిన హనియేని దాడి చేసి చంపారు.
‘‘ఈ రోజు, ఇరాన్ తన బాధలు మరియు ఆనందాలను పంచుకునే వ్యక్తిని, ప్రతిఘటన మార్గంలో నిరంతరం మరియు గర్వించదగిన సహచరుడు, పాలస్తీనా ప్రతిఘటన యొక్క ధైర్య నాయకుడు, అల్-ఖుద్స్ యొక్క అమరవీరుడు, హజ్ ఇస్మాయిల్ హనియేహ్‌ని నిన్న నేను నా భుజాల మీద సమాధి చేసాను. ఇరాన్, పాలస్తీనా రెండు గర్వించదగిన దేశాల మధ్య బంధం మరింత బలపడుతుంది అణచివేతకు గురైన వారి ప్రతిఘటన మరియు రక్షణ గతంలో కంటే బలంగా అనుసరించబడుతుంది. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ తన ప్రాదేశిక సమగ్రత, గౌరవం, గర్వాన్ని కాపాడుతుంది. తీవ్రవాద ఆక్రమణదారులు వారి పిరికి చర్యకు పశ్చాత్తాపపడేలా చేస్తుంది’’ అని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంతాప సందేశాన్ని ఇచ్చారు.
Also Read
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్‌ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
- Donald Trump: గూగుల్, చాట్‌జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
Read Also: Srisailam Inflow: శ్రీశైలానికి తగ్గిన వరద.. 8 గేట్ల ద్వారా నీటి విడుదల
మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ హస్సేనీ ఖమేనీ తన సంతాపాన్ని తెలియజేశారు. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా హనియే మృతికి సంతాపం తెలియజేస్తూ.. ఆయన రక్తం, త్యాగం వృథా కాబోనివ్వమని చెప్పింది. ఖతార్ విదేశాంగ శాఖ కూడా ఇస్మాయిల్ హనియే హత్యను తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ మానవతా చట్టాల్ని స్పష్టంగా ఉల్లంఘించడమే అని వ్యాఖ్యానించింది. పౌరులను హత్య చేయడం ఈ ప్రాంతంతో మరింత అహింసకు దారి తీస్తుందని చెప్పింది. రష్యా దీనిని ‘‘ఆమోదించలేని రాజకీయ హత్య’’గా అభివర్ణించింది.
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో తమ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియెహ్ హత్యకు గురైన తర్వాత ప్రతీకారం తీర్చుకుంటామని పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ప్రతిజ్ఞ చేసింది. హనియే హత్యకు ఇజ్రాయెల్‌ను నిందించింది. ఇతర పాలస్తీనియన్ గ్రూపులు కూడా హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ హత్యను ఖండించాయి. దీనికి ఇజ్రాయిల్ మూల్యం చెల్లించుకుంటుందని పరోక్షంగా హెచ్చరించింది. లెబనాన్ హిజ్బోల్లా హనియే హత్య తమ సంకల్పాన్ని మరింత బలపరుస్తుందని పేర్కొంది.
తాజావార్తలు
-
‘Peddi’: టాలీవుడ్ అంటే అంత అలుసా? ‘పెద్ది’ విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
-
Akhilesh Yadav: రామమందిరంలో కానుకలు మాయం?.. అఖిలేష్ సంచలన ఆరోపణ
-
Harish Rao : రేవంత్‌కు రైతుల శాపం తప్పదు.. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది
-
Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
-
Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!