NTV Telugu Site icon

Pakistan: మహిళల శవాలపై అత్యాచారం.. సమాధులకు తాళాలు వేస్తున్న తల్లిదండ్రులు..

Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్ లో అరాచకం రాజ్యమేలుతోంది. అక్కడ ఆర్థిక సంక్షోభం ప్రజలను తీవ్ర పేదరికంలోకి నెట్టేస్తోంది. ఇక రాజకీయంగా అస్థిరత నెలకొంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ వార్త ఒళ్లుగగుర్పాటుకు గురిచేస్తోంది. పాకిస్తాన్ లోని తల్లిదండ్రులు తమ కూతుళ్ల సమాధులకు తాళాలు వేయాల్సిన పరిస్థితి దాపురించింది. చనిపోయిన కూతుళ్ల శవాలపై అత్యాచారాలకు ఒడిగట్టకుండా తల్లిదండ్రులు సమాధులకు తాళాలు వేస్తున్నారని డైలీ టైమ్స్ వెల్లడించింది. దేశంలో ‘‘నెక్రోఫిలియా’’ కేసులు పెరుగుతున్నాయని ఈ నివేదిక పేర్కొంది.

కొంతమంది కామాంధులు తమ లైంగిక కోరికలను తీర్చుకునేందుకు ఇలాంటి వికృత చర్యలకు పాల్పడుతున్నారని, ఇలాంటివి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమవారి శవాలను అపవిత్రం కాకుండా సమాధులకు తాళాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2011లో పాకిస్తాన్ లో తొలి నెక్రోఫిలియా కేసు నమోదైంది. కరాచీలోని ఉత్తర నజీమాబాద్ కు చెందిన మహ్మద్ రిజ్వాన్ అనే కాటికాపరి 48 మహిళ శవాలపై అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నాడు. ఆ తరువాత అతడిని అరెస్ట్ చేశారు.

Read Also: Anji Khad bridge: ఇండియాలో మొట్టమొదటి కేబుల్-స్టేడ్ రైలు వంతెన సిద్ధం.. ఎక్కడంటే..?

ఇటీవల మే 2022లో, పాకిస్థాన్‌లోని గుజ్రాత్ ప్రాంతంలోని చక్ కమలా గ్రామంలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు టీనేజ్ బాలిక శవాన్ని తవ్వి, అత్యాచారం చేశారు. సదరు అమ్మాయిని ఖననం చేసిన ఆదే రోజు రాత్రి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాలిక సమాధికి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు బంధువులు వెళ్లగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. శవంపై అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. 2021లో ఇలాగే కోస్టల్ టౌన్ గులాముల్లా సమీపంలో మౌల్వీ అష్రఫ్ చండియో గ్రామంలో కూడా ఇలాంటి అనాగరిక చర్యకు పాల్పడ్డారు.

2020లో పాకిస్తాన్ పంజాబ్ లోని స్మశాన వాటికలో ఒక మహిళ శవాన్ని రేప్ చేస్తున్న క్రమంలో నిందితుడిని పట్టుకున్నారు. 2019లో కరాచీలోని లాంధీ టౌక్ లో ఒక మహిళ మృతదేహాన్ని తవ్వి అత్యాచారానికి పాల్పడ్డారు. 2013లో గుజ్రాన్ వాలాలో 15 ఏళ్ల బాలిక మృతదేహన్ని సమాధి నుంచి తీసి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేలింది. ప్రస్తతం ప్రధాని షహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం ఇలాంటి ఘటనలపై విచారణకు ఆదేశించింది.