Site icon NTV Telugu

Pannun murder plot: నిఖిల్ గుప్తా కేసులో ‘భారత అధికార పరిధి’ లేదు.. స్పష్టం చేసిన చెక్ రిపబ్లిక్..

Khalistan

Khalistan

ఖలిస్తానీ ఉగ్రవాది, సిఖ్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూను హత్య చేసేందుకు కుట్ర పన్నాడనే ఆరోపణలతో అమెరికా సూచనల మేరకు చెక్ రిపబ్లిక్ అధికారులు నిఖిల్ గుప్తా అనే భారతీయుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిఖిల్ గుప్తా ప్రేగ్ జైలులో ఉన్నాడు. ఈ కేసులో భారత్‌కి ఎలాంటి అధికార పరిధి లేదని చెక్ మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ తేల్చి చెప్పింది.

నిఖిల్ గుప్తాకు సంబంధించిన కేసులో భారతదేశంలోని న్యాయ అధికారులకు ‘‘ అధికారం లేదు’’ అని చెక్ రిపబ్లిక్ చెప్పింది. ఈ కేసులో జోక్యం చేసుకోవాలని కోరతూ నిఖిల్ గుప్తా కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన కొన్ని రోజుల తర్వాత చెక్ అధికారుల నుంచి ఈ స్పందన వచ్చింది.

Read Also: Cyber Attacks: దేశంలో ప్రతి నిమిషానికి 761 సైబర్ దాడులు, 2023లో 40 కోట్లకు!

అమెరికా-కెనడా ద్వంద్వ పౌరసత్వం కలిగిన పన్నూ హత్యకు కుట్రపన్నిట్లు నిఖిల్ గుప్తా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అమెరికా సమచారంతో చెక్ అధికారులు ఆరు నెలల క్రితం గుప్తాను అరెస్ట్ చేశారు. ఇతనిని అమెరికాకు అప్పగించేందుకు యూఎస్-చెక్ దేశాల మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయి. గత వారం నిఖిల్ గుప్తా కుటుంబ సభ్యులు భారత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పగింత ప్రక్రియలో జోక్యం చేసుకునేలా, ఈ కేసులో న్యాయపరమైన విచారణ జరిగేలా భారత ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. పన్నూ హత్యకుట్రలో నిఖిల్ గుప్తాకు భారత ప్రభుత్వ ఉద్యోగి సహకరించారంటూ అమెరికా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ హత్య కుట్రపై విచారించేందుకు భారత్ అత్యున్నత కమిటీని ఏర్పాటు చేసింది.

భారత జోక్యంపై చెక్ మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ ప్రతినిధి వ్లాదిమిర్ రెప్కా మాట్లాడుతూ.. రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలోని ఏ న్యాయపరమైన అధికారులకు ఈ విషయంలో ఎలాంటి అధికార పరిధి లేదని, ఈ కేసు చెక్ రిపబ్లిక్ అధికార పరిధిలో ఉందని చెప్పారు. జైలులో గుప్తాకు సరైన ఆహారం అందించడం లేదన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.

Exit mobile version