NTV Telugu Site icon

Pakistan: సంక్షోభ పాకిస్తాన్‌లో ఎన్నికల నగారా.. వచ్చే జనవరిలో ఎలక్షన్స్..

Pakistan

Pakistan

Pakistan: ఆర్థిక, రాజకీయ అస్థిరతతో ఇబ్బందులు పడుతున్న పాకిస్తాన్ లో 2024 జనవరి చివరి వారంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ దేశ ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. నియోజకవర్గాల విభజనను సమీక్షించింది, సెప్టెంబర్ 27న తొలి జాబితా విడుదల చేసేందుకు పాక్ ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుందని అక్కడి డాన్ న్యూస్ వెల్లడించింది. ఎన్నికల సంఘం ప్రాథమిక జాబితాపై అభ్యంతరాలు, తదుపరి వాదనలు విన్న తర్వాత, నవంబర్ 30న తుది జాబితాను విడుదల చేయనుంది. 54 రోజుల పాటు ఎన్నికల ప్రచార కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తరువాత 2024 జనవరి చివరి వారంలో ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఆగస్టు 9న ముందస్తుగా రద్దు చేయబడింది. పదవీ కాలం ముగియడానికి కొద్ది రోజుల ముందు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం, జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత ఎన్నికలు నిర్వహించవచ్చని ప్రకటించింది. సాధారణంగా జాతీయ అసెంబ్లీ రద్దైన తర్వాత 90 రోజల్లో ఎన్నికలు జరగాలి. అయితే గత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయి. పాకిస్తాన్ లోని అన్ని జాతీయ పార్టీలు డీలిమిటేషన్ కాల పరిమితిని తగ్గించాలని పాక్ ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఈ ప్రక్రియకు కనీసం నాలుగు నెలల సమయం పట్టనుంది.

Read Also: Anitha : బికినిలో థండర్ థైస్ తో రచ్చ చేస్తున్న అనిత.. ఇలా చూపిస్తే ఎలా పాప..

ప్రస్తుతం పాకిస్తాన్ లో అన్వర్ ఉల్ కాకర్ ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వం ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో పాకిస్తాన్ ఎన్నికల ఖర్చును కూడా భరించే పరిస్థితి లేదని గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. ఇప్పటీకీ ఆ దేశంలో ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ద్రవ్యోల్భణం ఎప్పుడూ లేనంతగా రికార్డ్ స్థాయికి చేరుకుంది. డాలర్ తో పాకిస్తాన్ రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. ఇదిలా ఉంటే మరోవైపు మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత అయిన ఇమ్రాన్ ఖాన్‌ని అవినీతి ఆరోపణలతో జైలులో పెట్టింది. ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించింది. ఇక పాక్ సైన్యం తమకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం ఉండేలా పావులు కదుపుతోంది. అందుకే ఇమ్రాన్ ఖాన్ ని జైలులో పెట్టి, ప్రవాసంలో ఉన్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ని దేశంలోకి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది.

Show comments