Site icon NTV Telugu

Pakistan: పాక్ తొలి ట్రాన్స్‌జెండర్ న్యూస్ యాంకర్‌పై కాల్పులు..

Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్ లో ఇస్లామిక్ మతఛాందసవాదులు ఎంతలా పెరిగి పోయారంటే దైవదూషణ పేరుతో ప్రాణాలు తీస్తున్నారు. ఏకంగా పోలీస్ స్టేషన్ల పై దాడులు చేస్తూ ప్రజలను చంపేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ తొలి ట్రాన్స్‌జెండర్ న్యూస్ యాంకర్ పై కాల్పులు జరిపారు దుండగులు. మార్వియా మాలిక్ (26) లాహోర్ లో ఫార్మసీ నుంచి తన ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో తుపాకీ దాడికి గురైంది. ఈ దాడిలో తృటిలో ప్రాణాలతో బయటపడింది. శుక్రవారం ఈ ఘటన జరిగింది. పాకిస్థాన్‌లోని ట్రాన్స్‌జెండర్ల కోసం పోరాడుతున్నందుకు గత కొంత కాలంగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని మాలిక్ పోలీసులకు తెలిపారు. ఇదే దాడికి కారణం అని ఆమె పేర్కొన్నారు.

Read Also: Nikki Haley: పాక్, చైనాలు చెడ్డ దేశాలు.. అధికారంలోకి వస్తే శత్రు దేశాలకు నిధులు ఇవ్వం..

ప్రాణ భయంతో లాహోర్ వదిలి ఇస్లామాబాద్, ముల్తాన్‌లకు మకాం మార్చినట్లు మాలిక్ తెలిపారు. శస్త్రచికిత్స కోసం లాహోర్ వచ్చినప్పుడు ఈ దాడి జరిగింది. 2018లో మొదటిసారిగా లింగమార్పిడి చేసుకున్న వ్యక్తిగా మాలిక్ పాకిస్తాన్ లో రికార్డు సృష్టించారు. ఈమె నిర్ణయాన్ని కుటుంబం కూడా వ్యతిరేకించింది. పాకిస్తాన్ ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఏటా నిర్వహించే ప్రముఖ ఫ్యాషన్ షోలో మొదటి లింగమార్పిడి మోడల్‌గా కనిపించింది. కొద్ది రోజుల నుంచి కోహినూర్ టీవీలో యాంకర్ గా పనిచేస్తోంది. 10వ తరగతి చదువుతున్న సమయంలోనే కుటుంబానికి దూరం అయ్యానని, బ్యూటీ సెలూన్లలో పనిచేశానని, కాలేజీలో చేరడానికి డబ్బు సంపాదించినా, అది అంత సులభం కాదని ఆమె అన్నారు. వీధిలో భిక్షాటన చేస్తున్న హిజ్రా కథకు నా కథ భిన్నంగా ఏం లేదని ఆమె అన్నారు.

Exit mobile version