Pakistan: చివరకు పాస్‌పోర్ట్‌లు ప్రింట్ చేసుకోలేని దుస్థితిలో పాకిస్తాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీనికి తోడు రాజకీయ సంక్షోభం కూడా ఆ దేశాన్ని కుదిపేస్తోంది. చివరకు పాకిస్తాన్ పరిస్థితి ఎలా తయారైందంటే.. చివరకు పాస్‌పోర్టులు కూడా ప్రింట్ చేసుకోలేని దుస్థితికి చేరుకుంది. దీంతో విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Read Also: Sowa Fish: “ఇది చేప కాదు, బంగారం”.. ఒకే రాత్రిలో కోటీశ్వరుడైన పాక్ మత్స్యకారుడు..
Also Read
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
దేశంలో లామినేషన్ పేపర్‌కి తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో కొత్త పాస్‌పోర్ట్‌లు అందకు లక్షలాది మంది వేచిచూస్తున్నారు. పాస్‌పోర్ట్‌ల ముద్రణకు లామినేషన్ పేపర్ చాలా కీలకం. పాకిస్తాన్ వీటిని ఫ్రాన్స్ నుంచి తెప్పించుకుంటోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ వీటిని దిగుమతి చేసుకునేందుకు కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతోంది. రెండు నెలల క్రితం లామినేషన్ పేపర్ కోసం ఆర్డర్ పెట్టినా.. డబ్బులు లేక చెల్లింపులు చేయకపోవడంతో ఫ్రాన్స్ నుంచి దిగుమతి కాలేదు. దీంతో చేసేదేం లేక పాస్‌పోర్ట్‌ల ముద్రణ ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. పాకిస్తాన్ నుంచి యూకే, ఇటలీ వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నిరీక్షణ వల్ల తాము అవకాశాలు కోల్పోతున్నామని చెబుతున్నారు. గతంలో 2013లో కూడా పాక్ ఇలాంటి సమస్యనే ఎదుర్కొంది.
ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు పాక్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మీడియా డైరెక్టర్ జనరల్ ఖాదిర్ యార్ తివానా తెలిపారు. త్వరలో పరిస్థితి అదుపులోకి వస్తుందని, పాస్‌పోర్ట్‌ల జారీ యథావిధిగా కొనసాగుతుందని ఆయన చెప్పారు. పాకిస్తాన్ వ్యాప్తంగా పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇంతకుముందు రోజుకు 3000-4000 పాస్‌పోర్టులను ప్రాసెస్ చేసేవారమని, ఇప్పుడు రోపజుకు 12-13 మాత్రమే పాస్‌పోర్టులు ఇవ్వగలుతుగున్నామని అక్కడి అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!