Site icon NTV Telugu

Pakistan: అంధకారంలో పాకిస్తాన్.. కరాచీ, లాహోర్‌లలో కరెంట్‌కు అంతరాయం

Pakistan

Pakistan

Pakistan Witnesses Major Power Breakdown: దాయాది దేశం పాకిస్తాన్ లో తీవ్ర విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు పలుచోట్ల విద్యుత్ లేదు. దేశ రాజధాని ఇస్లామాబాద్ తో పాటు లాహోర్, కరాచీ నగరాల్లో అంధకారం అలుముకుంది. ట్రాన్స్మిషన్ లైన్లలో లోపం కారణంగా దేశవ్యాప్తంగా విద్యుత్ అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ లో ఉదయం 7.30 గంటల నుంచి దేశవ్యాప్తంగా విద్యుత్ అంతరాయం ఏర్పడిందని పాకిస్తాన్ జర్నలిస్ట్ అసద్ అలీ తూర్ ట్వీట్ చేశారు.

Read Also: Petrol and Diesel Prices: తగ్గనున్న పెట్రో ధరలు.. గుడ్‌న్యూస్‌ చెప్పిన కేంద్ర మంత్రి..

బలూచిస్తాన్ రాష్ట్రంలో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది గుడ్డుె నుంచి క్వెట్టాకు వెళ్లే రెండు ప్రధాన ట్రాన్స్‌మిషన్ లైన్లు ట్రిప్ అయ్యాయి. క్వెట్టా సహా బలూచిస్థాన్‌లోని 22 జిల్లాల్లో విద్యుత్తు సరఫరా లేదని క్వెట్టా ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ పేర్కొంది. పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. దీంతో ఇంధనం కూడా కొనుగోలు చేసేందుకు విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి. దీంతో అక్కడి విద్యుత్ పరిశ్రమ తీవ్ర ఒత్తడిని ఎదర్కొంటోంది. అక్కడా రాత్రి 8 గంటల తరువాత మార్కెట్ల బంద్ చేయడంతో పాటు ఇతర విద్యుత్ ఆదా చర్యలు తీసుకుంటోంది అక్కడి ప్రభుత్వం. తాజాగా జరిగిన బ్లాక్ అవుట్ కారణంగా దేశంలోని ప్రధాన నగరాలు విద్యుత్ లేదు. గత ఏడాది అక్టోబర్ లో కూడా ఇలాగే పాకిస్తాన్ విద్యుత్ అంతరాయాన్ని ఎదర్కొంది. దీని వల్ల పాకిస్థాన్ రాజధానితో పాటు ప్రావిన్షియల్ రాజధానులు అయిన కరాచీ, లాహోర్లలో 12 గంటలకు పైగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది.

Exit mobile version