Site icon NTV Telugu

Afghan-Pak War: ఆఫ్ఘాన్ ముందు పాకిస్తాన్ సరెండర్.. 48 గంటల కాల్పుల విరమణ..

Afghan Pak War

Afghan Pak War

Afghan-Pak War: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌ల మధ్య గత కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రికత కొనసాగుతోంది. రెండు దేశాలు సరిహద్దుల వద్ద తీవ్రమైన కాల్పులు జరిపాయి. ఈ దాడుల్లో ఇరు వైపుల పదుల సంఖ్యలో సైనికులు మరణించారు. ఇదిలా ఉంటే, రెండు దేశాల మధ్య 48 గంటల పాటు ‘‘కాల్పుల విరమణ’’ ఒప్పందం కుదిరింది. ఆఫ్ఘాన్ దాడులు తట్టుకోలేక, పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించింది. సౌదీ అరేబియా, ఖతార్ దేశాలను రెండు దేశాల మధ్య మిడియేషన్ చేయాలని, ఆఫ్ఘాన్ దాడులు ఆపేలా చేయాలని పాకిస్తాన్ కోరింది. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 48 గంటల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ పాటించేందుకు రెండు దేశాలు అంగీకరించినట్లు తెలుస్తోంది.

Read Also: Maoist Surrender: మావోల ‘‘లొంగు’’బాట.. రేపు ఛత్తీస్‌గఢ్ సీఎం ముందు ఆశన్న సరెండర్..

పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఈ విషయాన్ని ప్రకటించింది. పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు సమస్య శతాబ్ధానికి పైగా ఉంది. రెండు దేశాల మధ్య ‘‘డ్యూరాండ్ లైన్’’ ఈ ఘర్షణలకు మూలంగా మారింది. పాకిస్తాన్ ఈ సమస్యను ‘‘సంక్లిష్టమైన కానీ పరిష్కరించగల సమస్య’’గా అభివర్ణించింది. దీనికి సానుకూల పరిష్కారం కనుగొనడానికి నిజాయితీగా ప్రయత్నించడానికి రెండు వైపుల అంగీకారం కుదిరింది అని చెప్పింది. దౌత్యపరమైన సంభాషణలు, శత్రుత్వాన్ని నిలిపేసేందుకు ఈ ఒప్పందం కుదిరినట్లు పాక్ చెప్పింది.

నివేదికల ప్రకారం, పాకిస్తాన్ పోరాటాన్ని ఆపేయాలని, ‘‘అల్లాహ్ కే వాస్తే(దేవుడి కోరకు)’’ దాడుల్ని ఆపేయాలని తమను కోరినట్లు ఆఫ్ఘనిస్తాన్ అధికారి అబ్దుల్ హక్ హమద్ చెప్పారు. ఆరు నెలల వ్యవధిలో పాకిస్తాన్ రెండోసారి సరెండర్ అయింది. అంతకుముందు భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహిస్తే, నాలుగు రోజుల్లోనే పాక్ చేతులు ఎత్తేసి, శాంతి జెండాను ఎగురవేసింది.

Exit mobile version